జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్..
- July 09, 2025
యూట్యూబ్ క్రియేటర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. ప్రస్తుత రోజుల్లో యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించడం చాలా సులభం (YouTube Monetization Rules) అనేవారికి నిజంగా షాకే.. యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్‌లో అతిపెద్ద మార్పులు చేస్తోంది. ఈ కొత్త రూల్స్ జూలై 15 నుంచి అమల్లోకి వస్తాయి. ఏఐ కంటెంట్, కాపీ కంటెంట్ పబ్లీష్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై ఎఫెక్ట్ పడనుంది. ఏకంగా మానిటైజేషన్ కూడా కోల్పోవచ్చు..
యూట్యూబ్ ఛానెల్స్ సంఖ్య చాలా పెరిగాయి. ఏఐ ఉపయోగించి ఈజీగా వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. చాలా మంది యూట్యూబ్ క్రియేటర్లు ఇతరుల వీడియోలలో స్వల్ప మార్పులు చేసి తెగ అప్‌లోడ్ చేస్తున్నారు. పాత వీడియోలను మళ్లీ మళ్లీ అప్‌లోడ్ చేసి వ్యూస్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు YouTube వీటన్నింటికీ చెక్ పెట్టబోతోంది.
యూట్యూబ్ కొత్త రూల్స్ ఏంటి?
జూలై 15, 2025 నుంచి ఒకే వీడియోను పదే పదే అప్‌లోడ్ చేయడం లేదా వేరొకరి వీడియోను పోస్ట్ చేసేవారికి యూట్యూబ్ నుంచి డబ్బులు రావు. పైగా ఆ యూట్యూబ్ ఛానల్‌కు ఉన్న మానిటైజేషన్ కూడా పోతుంది.
యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోల క్వాలిటీని మెరుగుపర్చేందుకు యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా యూట్యూబ్ నియమాలను కఠినతరం చేస్తోంది. రియల్ కంటెంట్ క్రియేటర్లను ప్రొటెక్ట్ చేయడం, ప్లాట్‌ఫారమ్‌ను దుర్వినియోగం చేసే ఛానెల్స్ సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు