సోషల్ డెవలప్ మెంట్ బ్యాంకు.. కృతజ్ఞతలు తెలిపిన అల్ రాజి..!!

- July 10, 2025 , by Maagulf
సోషల్ డెవలప్ మెంట్ బ్యాంకు.. కృతజ్ఞతలు తెలిపిన అల్ రాజి..!!

రియాద్: సోషల్ డెవలప్ మెంట్ బ్యాంకుకు సంబంధించి మంగళవారం క్యాబినెట్ నిర్ణయాన్ని మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రి, సామాజిక అభివృద్ధి బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఇంజినీర్ అహ్మద్ అల్-రాజి ప్రశంసించారు.  ఇది సౌదీ సమాజంలోని అత్యంత దుర్బల వర్గాలకు మద్దతుగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్‌లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.  

"సౌదీ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా, బ్యాంకు తన లక్ష్యాలను సాధించడానికి, అలాగే బ్యాంకు అభివృద్ధి ప్రభావాన్ని పెంచడానికి, తద్వారా అత్యధిక సంఖ్యలో లబ్ధిదారులను శక్తివంతం చేయడానికి..స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి బ్యాంకు సమర్థవంతంగా పనిచేస్తుంది." అని ఆయన అన్నారు.

వ్యక్తిగత ఆదాయంతోపాటు వ్యాపారాభివృద్ధికి అవసరమైన ప్రత్యేక ఫైనాన్సింగ్ పరిష్కారాలును ఈ బ్యాంకు అందజేస్తుందని తెలిపారు. బ్యాంకు మొత్తం ఫైనాన్సింగ్ SR160 బిలియన్లను దాటిందని, 10 మిలియన్లకు పైగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చిందని, జాతీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com