పర్యావరణ-పర్యాటక కేంద్రంగా అల్ జబల్ అల్ షార్కీ..!!

- July 10, 2025 , by Maagulf
పర్యావరణ-పర్యాటక కేంద్రంగా అల్ జబల్ అల్ షార్కీ..!!

అల్ హమ్రా: ఒమన్ లోని అల్ జబల్ అల్ షార్కీ (తూర్పు పర్వతం) సరికొత్త పర్యావరణ-పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది. అక్కడ దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని పెంచేందుకు పర్యాటక మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయనున్నారు.  అల్ జబల్ అల్ షార్కీ అభివృద్ధికి గవర్నరేట్ ప్రాధాన్యత ఇస్తుందని అ’దఖిలియా గవర్నర్ షేక్ హిలాల్ సయీద్ అల్ హజ్రీ తెలిపారు. పర్యాటక మంత్రిత్వ శాఖ సహకారంతో గవర్నరేట్ పర్యాటక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తోందని, సందర్శకుల రాకను పెంచుతుందని తెలిపారు.  "అల్ జబల్ అల్ షర్కి ఒయాసిస్" ప్రాజెక్ట్‌ను గవర్నరేట్‌లోని అత్యంత ప్రముఖ అభివృద్ధి కార్యక్రమాలలో ఒకటిగా హైలైట్ చేశారు.

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి టెండర్లను ఏప్రిల్‌ నెలలో పూర్తయ్యాయని తెలిపారు. బిడ్‌లు ప్రస్తుతం సమీక్షలో ఉన్నాయని అన్నారు. 10,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో పురుషులు, మహిళలకు ప్రార్థన మందిరాలు, 300 చదరపు మీటర్లలో రెస్టారెంట్, ఒపెన్ థియేటర్, 13 సీటింగ్ కానోపీలు, నడక మార్గాలు, ఓపెన్ గార్డెన్లు, సంవత్సరం పొడవునా సైట్ ఆకర్షణను పెంచడానికి రూపొందించిన సౌకర్యాలు, పర్యాటక సదుపాయాలు ఉన్నాయి.

అల్ జబల్ అల్ షార్కీ ఏడాది పొడవునా సందర్శించదగిన గమ్యస్థానం అని, ముఖ్యంగా క్యాంపింగ్, సాహస ప్రియులకు అద్భుత ప్రదేశమని అల్ దఖిలియా గవర్నర్ పేర్కొన్నారు.  అల్ హమ్రాకు చెందిన వాలి షేక్ సులైమాన్ సయీద్ అల్ అజ్రీ మాట్లాడుతూ "అల్ హమ్రా టూరిజం 2025" కార్యక్రమం ఆగస్టు 1న అల్ జబల్ అల్ షార్కీలో ప్రారంభమై ఆగస్టు 30 వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వినోదం, సాహసం, సంస్కృతిని మిళితం చేస్తూ అన్ని వయసుల వారికి ఉపయోగపడే విభిన్న కార్యకలాపాలతో కూడిన కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పర్వత శిఖరాలపై ప్రత్యేక క్యాంపింగ్ జోన్స్ తోపాట రెస్ట్ రూమ్స్ ఉన్నాయని అన్నారు. వాటితోపాటు పర్వత గుర్రపు స్వారీలు, హైకింగ్ ట్రైల్స్, ఎత్తైన శిఖరాలకు 4x4 వాహన పర్యటనలు కూడా ప్రత్యేక ఆకర్షణ అని అన్నారు.

అల్ జబల్ అల్ షార్కి ఒమన్‌లోని అత్యంత ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది సముద్ర మట్టానికి 2,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏడాది పొడవునా సందర్శకులను ఆకర్షించే మితమైన వాతావరణంతో ఉంటుందని వెల్లడించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com