అరబిక్ ఎక్కడ? ఎమిరేట్స్ ఆందోళన..!!

- July 10, 2025 , by Maagulf
అరబిక్ ఎక్కడ? ఎమిరేట్స్ ఆందోళన..!!

యూఏఈ: యూఏఈలో ఎక్కువ మంది యువ అరబ్బులు ఇంగ్లిష్ లో మాత్రమే మాట్లాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంగ్లిష్ మెనూలను అందించే రెస్టారెంట్లు, కేఫ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, వృద్ధ ఎమిరేట్స్ గురించి ఆందోళన చెందుతున్న ఎమిరాటీల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఈ మేరకు ఒక ప్రత్యేక ప్రచారం ప్రారంభమైంది. బహిరంగ ప్రదేశాల్లో అరబిక్ వినియోగం తగ్గడం కాణంగా సాంస్కృతికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని వారు భావిస్తున్నారు. కాగా, ఎక్కువ మంది ఇంగ్లీషులో నిష్ణాతులు అయినప్పటికీ, అరబ్ దేశంలో గుర్తింపు, గౌరవం కోసం వారు వాదిస్తున్నారు.

“నేను ఇంగ్లీష్ చదవలేనని కాదు. కానీ నేను నా స్వంత దేశంలో మెనూ తెరిచి అరబిక్ చూడనప్పుడు, నేను తక్కువ విలువను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది” అని దుబాయ్‌లో పనిచేస్తున్న 35 ఏళ్ల ఎమిరాటీ యాసిర్ అల్ జాబి అన్నారు.   ఇటీవల, కొంతమంది నివాసితులు అరబిక్ మెనూలను అందించాలని రెస్టారెంట్లు, కేఫ్‌లను నేరుగా సంప్రదిస్తున్నారు. మరికొందరు అరబిక్ లో మెనూలను అడగాలని సోషల్ మీడియా వేదికల్లో పిలుపునిస్తున్నారు.   

యువ స్టార్టప్‌లను, వారి బ్రాండింగ్, కస్టమర్ అనుభవంలో అరబిక్‌ను చేర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అబుదాబికి చెందిన 28 ఏళ్ల ఫాతిమా షమ్స్ పిలుపునిస్తంది.  ప్రపంచవ్యాప్తంగా, గుర్తింపు, సంస్కృతి, భాష బ్రాండ్ గుర్తింపులో కీలకమైన భాగాలుగా ఉంటాయన్నారు. "అరబిక్ మా వారసత్వం, ఇక్కడ ప్రతి వ్యాపారంలో అది కనిపించేలా మరియు విలువైనదిగా ఉండాలి" అని ఆమె అభిప్రాయపడింది.

దుబాయ్‌లో అరబిక్ మెనూలు తప్పనిసరి అని స్పష్టంగా పేర్కొన్న నిబంధనలు ఉన్నప్పటికీ అమల్లో మాత్రం అంతగా లేదని కొందరు చెబుతున్నారు. 2015 నాటికి అరబిక్ మెనూలను అమలు చేయడం లేదని 29 రెస్టారెంట్లకు జరిమానా విధించినట్లు కొందరు గుర్తుచేస్తున్నారు.  ప్రస్తుతం ఇలాంటి తనిఖీలు జరగడం లేదని షార్జాకు చెందిన 22 ఏళ్ల విశ్వవిద్యాలయ విద్యార్థిని సల్మా నూర్ చెబుతున్నారు. "నేను ఎల్లప్పుడూ ఇంగ్లీషులో ఆర్డర్ చేస్తాను. అది సమస్య కాదు. కానీ నేను అరబిక్ చూడనప్పుడు, వారు మా గురించి అస్సలు ఆలోచించడం లేదని నాకు అనిపిస్తుంది." అని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com