యూఏఈలో UPI: త్వరలో ఫోన్‌ల ద్వారా పేమెంట్స్..!!

- July 11, 2025 , by Maagulf
యూఏఈలో UPI: త్వరలో ఫోన్‌ల ద్వారా పేమెంట్స్..!!

యూఏఈ: యూఏఈకి వచ్చే భారతీయులు త్వరలో నగదు, కార్డులు లేదా చెల్లింపు సాధనాలు తేవాల్సిన అవసరం లేదు. కేవలం వారి పాస్‌పోర్ట్‌లు, ఫోన్ ఉంటే చాలు. వాటితోనే పేమెంట్స్ చేసే రోజులు త్వరలోనే రానున్నాయి. దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ..అన్ని ఆర్థిక లావాదేవీలకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో చెల్లింపు చేసే రోజులు త్వరలోనే వస్తాయని పేర్కొన్నారు.  యూఏఈలో UPI విస్తరణ జరుగుతుందన్నారు.  

అయితే, యూఏఈలో UPI చెల్లుబాటు అనేది NPCI ఇంటర్నేషనల్ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. లులు, దుబాయ్ డ్యూటీ ఫ్రీ వంటి ప్రధాన రిటైల్ చైన్స్ ఇప్పటికే యూపీఐని అందుబాటులోకి తీసుకువచ్చాయి. భారతీయ సందర్శకులు ఇప్పుడు తమ భారతీయ బ్యాంకు ఖాతాల నుండి నేరుగా చెల్లించడానికి మొబైల్ యాప్‌లను ఉపయోగించవచ్చు. తదుపరి దశలో యూఏఈ స్థానిక చెల్లింపు వ్యవస్థ AANIతో భాగస్వామ్యం ఏర్పాటు.. రెండు దేశాల మధ్య డిజిటల్ ఆర్థిక కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com