ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..5 మంది మృతి..11 మందికి గాయాలు..!!
- July 11, 2025
మస్కట్: దోఫర్ గవర్నరేట్‌లోని సుల్తాన్ సయీద్ బిన్ తైమూర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారని, 11 మంది గాయపడ్డారని ఒమన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం మృతుల్లో ఇద్దరు ఒమానీలు, ముగ్గురు ఎమిరాటీలు ఉన్నారు. గాయపడ్డ వారిలో ఇద్దరు ఒమానీలు, తొమ్మిది మంది ఎమిరాటీ పౌరులు ఉండగా.. వారిలో ఐదుగురు పిల్లలు ఉన్నారు.
గత వారం ఒమన్‌లో పిల్లలను తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై నలుగురు మరణించిన ఘటన మరువక ముందే ఈ దుర్ఘటన జరిగింది. ఇజ్కి గవర్నరేట్‌లోని అల్-రుసైస్ ప్రాంతంలో ఒక బస్సు డివైడర్ ను ఢీకొని బోల్తా పడటంతో ఈ విషాద సంఘటన జరిగింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్, ముగ్గురు పిల్లలు మరణించారు. 12 మంది పిల్లలు గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!