సింథటిక్ డ్రగ్ ల్యాబ్ కేసు.. నిందితుడిని భారత్ కు అప్పగించిన యూఏఈ..!!
- July 12, 2025
యూఏఈః ఇండియాలో నమోదైన మాదకద్రవ్యాల కేసులో కీలక నిందితుడిని యూఏఈ అప్పగించినట్లు భారత అధికారులు తెలిపారు. సింథటిక్ డ్రగ్ తయారీ కేంద్రాన్ని నిర్వహించడంలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ముంబై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కుబ్బవాలా ముస్తఫాను భారతదేశ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఇంటర్పోల్, అబుదాబిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సమన్వయంతో భారతదేశానికి అప్పగించారు.
CBI విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ముంబై పోలీసుల నలుగురు సభ్యుల బృందం ఈ వారం ప్రారంభంలో దుబాయ్ వెళ్లి జూలై 11న ముస్తఫాను తిరిగి ముంబైకి తీసుకువచ్చింది.
ముస్తఫాపై 2024లో ముంబైలో కేసు నమోదైంది. మహారాష్ట్రలోని సాంగ్లిలో సింథటిక్ డ్రగ్ ల్యాబ్ను నడుపుతున్నట్లు కేసు నమోదు చేశారు. అక్కడి నుండి 126 కిలోలకు పైగా మెఫెడ్రోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం 2024 నవంబర్లో ఇంటర్పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. జూన్లో NCB-అబుదాబి నిందితుడిని భారత్ కు అప్పగించేందుకు ముందుకువచ్చింది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!