'పెద్ది' నుంచి శివన్న ఫస్ట్ లుక్ వచ్చేసింది..
- July 12, 2025
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
నేడు శివరాజ్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ చిత్రంలోని ఆయన లుక్‌ను విడుదల చేసింది. శివన్న ఎంతో సీరియస్‌గా చూస్తున్నట్లుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!