దుబాయ్ మెట్రో సమీపంలో వ్యక్తికి గుండెపోటు.. రక్షించిన డాక్టర్..!!
- July 12, 2025
యూఏఈ: దుబాయ్ మెట్రో సమీపంలో గుండెపోటుకు గురైన వ్యక్తిని ఓ డాక్టర్ కాపాడి అందరి మన్ననలను అందుకున్నాడు. వివరాల్లోకివెళితే..సమీర్ (పేరు మార్చాము) పని నుండి బయటకు వచ్చి మెట్రో స్టేషన్ వైపు కొన్ని అడుగులు వేయగానే అతని దృష్టి మసకబారింది.. అతని కాళ్ళు వణికిపోయాయి.. అతను కాలిబాటపై కుప్పకూలిపోయాడు. ఊపిరి పీల్చుకోలేక స్పృహ కోల్పోయాడు.
అదే సమయంల దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్ (DIP)లోని NMC రాయల్ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో నిపుణుడు డాక్టర్ నీరజ్ గుప్తా.. అనుకోకుండా దూరంగా టీ, స్నాక్ తీసుకుంటున్నాడు. గుమికూడిన జనాన్ని చూసి అక్కడి చేరుకొని అతడికి సీపీఆర్ చేసి సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు.
“నేలపై ఒకరి చుట్టూ ప్రజలు నిలబడి ఉండటం నేను చూశాను. నేను అతని వద్దకు వెళ్ళినప్పుడు, అతనికి బాగా చెమటలు పడుతున్నాయి. నిమిషానికి నాలుగు సార్లు మాత్రమే ఊపిరి పీల్చుకుంటున్నాడని నేను గ్రహించాను. ఇది గుండెపోటు అని నేను గ్రహించాను. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా దుబాయ్ కార్పొరేషన్ ఫర్ అంబులెన్స్ సర్వీసెస్ (DCAS) ని అప్రమత్తం చేసి CPR ప్రారంభించాను. ఆసుపత్రికి చేరుకునేలోపు రెండు షాక్లు ఇచ్చాను. మూడవది అత్యవసర విభాగంలో ఇచ్చాను. ” అని డాక్టర్ నీరాజ్ గుర్తుచేసుకున్నారు.
ఆసుపత్రిలో పూర్తి కోడ్ బ్లూను యాక్టివేట్ చేశారు. రోగికి ప్రాధాన్యత ఇచ్చారు. అత్యవసర, ICU , కార్డియాలజీ బృందాలు రంగంలోకి దిగాయి. సమీర్కు క్లిష్టమైన గుండె జబ్బు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అక్యూట్ ఇన్ఫీరియర్ వాల్ ST-ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (STEMI), వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ (VF) గా గుర్తించారు. ఆపరేషన్ థియేటర్ లో యాంజియోగ్రఫీలో కుడి కరోనరీ ఆర్టరీలో 100 శాతం బ్లాక్స్, ఎడమవైపు 90 శాతం బ్లాక్స్ ఉన్నట్లు తేలింది. రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి నాలుగు డ్రగ్-ఎలుటింగ్ స్టెంట్లను వేశారు. డాక్టర్ల చొరవతో అతను కేవలం రెండు రోజుల్లోనే తిరిగి నడవగలిగాడు.
“నాకు డయాబెటిస్ ఉందని నాకు తెలియదునేను ఆరోగ్యంగా ఉన్నానని అనుకున్నాను. ఆ క్షణంలో డాక్టర్ అక్కడ లేకుంటే, నేను ఈ రోజు జీవించి ఉండేవాడిని కాదు. నేను చాలా కృతజ్ఞుడిని.” అని సమీర్ కోలుకున్న తర్వాత చెప్పారు.
ఈ సందర్భంగా డాక్టర్ నీరాజ్ మాట్లాడుతూ.. పేలవమైన జీవనశైలి అలవాట్లు యువకులలో గుండెపోటుకు అతిపెద్ద కారణాలలో ఒకటి అని అన్నారు. 30 ఏళ్లలోపు వ్యక్తులలో సాధారణంగా గుండెపోటు రాకుడదని అన్నారు. కానీ ఈ రోజుల్లో ఒత్తిడి, చెడు ఆహార అలవాట్లు, స్మోకింగ్, ప్రాసెస్ చేసిన ఫుడ్, అధిక కొలెస్ట్రాల్ ప్రధాన ప్రమాద కారకాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ లను చేసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా కొన్ని ప్రాథమిక గుండె పరీక్షలైన ట్రెడ్మిల్ టెస్ట్ (TMT), లిపిడ్ ప్రొఫైల్, రక్తంలో చక్కెర స్థాయిలు, గుండె CT స్కాన్ వంటివి సిఫార్సు చేశారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!