బార్డర్ ఇష్యూస్ పై చర్చించిన ఖతార్, సౌదీ అరేబియా..!!

- July 12, 2025 , by Maagulf
బార్డర్ ఇష్యూస్ పై చర్చించిన ఖతార్, సౌదీ అరేబియా..!!

దోహా: ఖతార్ - సౌదీ అరేబియా మధ్య మూడవ సమన్వయ సమావేశం దోహాలో జరిగింది. సరిహద్దు ప్రాంతాలైన అబు సమ్రా క్రాసింగ్, సల్వా క్రాసింగ్ లపై చర్చించారు. రాకపోకలను సులభతరం చేయడానికి భద్రతా సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు.

ఖతార్ వైపు అబు సమ్రా క్రాసింగ్ నిర్వహణ కోసం శాశ్వత కమిటీ ఛైర్మన్ కల్నల్ ఖలీద్ అలీ అల్ మెషల్ అల్ బుయైనైన్ నాయకత్వం వహించగా.. సౌదీ వైపు సల్వా క్రాసింగ్‌లోని బోర్డర్ గార్డ్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ (నేవీ) మొహమ్మద్ బిన్ సులేమాన్ అల్ బలవి నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో రెండు క్రాసింగ్‌ల మధ్య ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడం, అలాగే రెండు వైపులా సమన్వయాన్ని పెంపొందించడంపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన విధానాలపై ఏకభిప్రాయం కుదిరిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com