కువైట్ లో వాతావరణ మార్పులపై అవగాహన ప్రచారం..!!
- July 12, 2025
కువైట్: ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై అవగాహన ప్రచారం ప్రారంభమైంది. “వాతావరణ మార్పుతో మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోండి” అనే పేరుతో జరుగుతున్న అవగాహన ప్రచారాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. వేసవి అంతా జరిగే ఈ ప్రచారం.. వాతావరణ మార్పుల కారణంగా ఆరోగ్యంపై పడే ప్రభావాలను హైలైట్ చేస్తుంది. పర్యావరణం, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు.
క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా దేశాలను ప్రభావితం చేస్తున్నాయని, వాతావరణ మార్పు ప్రస్తుతం అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్యల అని ప్రజారోగ్య సహాయ కార్యదర్శి డాక్టర్ ముంథర్ అల్-హసావి అన్నారు. వాతావరణ మార్పులు ఆరోగ్య ప్రభావాల చూపే సమస్యలపై అవగాహన పెంచడానికి, వాటిని క్రమంగా తగ్గించడానికి విధానాలను అభివృద్ధి చేయడానికి మంత్రిత్వ శాఖ ఒక జాతీయ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు.
ఆరోగ్య ప్రమోషన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అబీర్ అల్-బుహు మాట్లాడుతూ.. ఈ ప్రచారంలో ఆరోగ్యకరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి, వాతావరణ మార్పులు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు, మారుతున్న వర్షపాత మోడల్స్, సముద్ర మట్టాలు పెరగడం వంటి వాటి గురించి అవగాహన పెంచడానికి వర్క్‌షాప్‌లు, లెక్చర్స్,ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!