అసిర్ తీరంలో బంగ్లాదేశ్ ప్రవాసిని పట్టుకున్న కోస్ట్ గార్డ్స్..!!
- July 12, 2025
జెడ్డా: అసిర్ ప్రాంతంలోని అల్-ఖహ్మాలో సముద్ర భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు బంగ్లాదేశ్ నివాసిని సౌదీ బోర్డర్ గార్డ్ తీరప్రాంత గస్తీ బృందం అరెస్ట్ చేసింది. అనుమతి లేకుండా అతను చేపలు పట్టడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించాడని అధికారులు తెలిపారు. సంబంధిత ఏజెన్సీల సమన్వయంతో అతనిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సముద్ర జీవులు, సహజ వనరులను రక్షించే సముద్ర భద్రతా చట్టాలు, నిబంధనలను అందరూ పాటించాలని బోర్డర్ గార్డ్ పిలుపునిచ్చింది.
ఏవైనా పర్యావరణ లేదా వన్యప్రాణుల ఉల్లంఘనలను అత్యవసర నంబర్లకు కాల్ చేయడం ద్వారా నివేదించాలని కోరారు. మక్కా, మదీనాతోపాటు తూర్పు ప్రావిన్స్‌లో 911; అన్ని ఇతర ప్రాంతాలలో 994, 999, 996 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!