కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన సీఎం
- July 13, 2025
హైదరాబాద్: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడించారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో ఉంచిన భౌతికకాయాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు మృతి బాధాకరం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. నటన అంటే ఏ విధంగా ఉండాలో 40ఏళ్ల పాటు నటించి చూపించారు. కోటతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఎంతో ప్రజా సేవ చేశారు. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







