రియాద్‌లో 10 ట్రావెల్ ఏజెన్సీలు మూసివేత..!!

- July 13, 2025 , by Maagulf
రియాద్‌లో 10 ట్రావెల్ ఏజెన్సీలు మూసివేత..!!

రియాద్:  లైసెన్స్‌లు లేకుండా పనిచేస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా ఉమ్రా, విజిటేషన్ ప్యాకేజీలను అందిస్తున్న రియాద్‌లోని 10 ట్రావెల్ సర్వీస్ కార్యాలయాలను పర్యాటక మంత్రిత్వ శాఖ మూసివేసింది. లైసెన్స్ లేని వాహనాలను ఉపయోగించి యాత్రికులను రవాణా చేయడం, మక్కా, మదీనాలోని అనధికార ఆతిథ్య సౌకర్యాలలో వారికి వసతి కల్పించడం ఈ ఉల్లంఘనలలో ఉన్నాయని తెలిపింది. పర్యాటక సంబంధిత కార్యకలాపాలను నియంత్రించడానికి, అధికారికంగా లైసెన్సింగ్ విధానం అమలుకు మంత్రిత్వ శాఖ ప్రత్యేక క్యాంపెయిన్ ను చేపడుతోంది. ఈ మేరకు సౌదీ అరేబియా అంతటా తనిఖీలు చేస్తున్నారు.

చట్లాలను ఉల్లంఘించిన ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటున్నామని,  చట్టపరమైన జరిమానాలు విధిస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.  వీటిలో SR50,000 వరకు జరిమానాలు ఉంటాయని తెలిపారు.  పునరావృత నేరాలకు SR1 మిలియన్ వరకు జరిమానాలు పెరగవచ్చని హెచ్చరించారు. నమోదైన ఉల్లంఘన తీవ్రతను బట్టి కార్యాలయాలను సీజ్ చేయడంతోపాటు భారీ జరిమానా విధిస్తారని తెలిపారు.   పర్యాటకుల, నివాసితులు 930 పర్యాటక కాల్ సెంటర్‌ను సంప్రదించడం ద్వారా ఆతిథ్య సేవలకు సంబంధించిన ఫిర్యాదులు లేదా ఉల్లంఘనలను నివేదించమని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com