ఆస్పైర్ సమ్మర్ క్యాంప్ 2025.. పిల్లల కేరింతలతో ప్రారంభం..!!

- July 14, 2025 , by Maagulf
ఆస్పైర్ సమ్మర్ క్యాంప్ 2025.. పిల్లల కేరింతలతో ప్రారంభం..!!

దోహా: ఆస్పైర్ సమ్మర్ క్యాంప్ 2025 అధికారికంగా ప్రారంభమైంది. పిల్లలు సరదాగా పాల్గొంటున్నారు. ఇంటరాక్టివ్ కార్యకలాపాలతో ఉత్సాహభరితమైన వాతావరణంలో కార్యక్రమం ప్రారంభమైంది. ఆగస్టు 7 వరకు జరిగే ఈ క్యాంప్.. 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు క్రీడలు, విద్యా , వినోద కార్యకలాపాల సమగ్ర అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది లేడీస్ స్పోర్ట్స్ హాల్‌లో వారానికి 5 రోజులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుంది.

ఈ సంవత్సరం కార్యక్రమంలో ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, ఆత్మరక్షణ, జిమ్నాస్టిక్స్, రిథమిక్ జిమ్నాస్టిక్స్ వంటి విస్తృత శ్రేణి క్రీడలు ఉన్నాయి. వీటితోపాటు దోహా అంతటా ప్రముఖ సాంస్కృతిక,  వినోద ప్రదేశాలకు ఫీల్డ్ ట్రిప్‌లతో పాటు రీడింగ్, డ్రాయింగ్‌లో విద్యా వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తారు. వేసవి సెలవుల్లో పిల్లల శారీరక,  సృజనాత్మక అభివృద్ధికి మద్దతు ఇచ్చేందుకు ఈ శిబిరం కృషి చేస్తుందని ఆస్పైర్ జోన్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com