తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం..
- July 14, 2025
న్యూ ఢిల్లీ: ఎల్లుండి మధ్యాహ్నం ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశాన్ని జలశక్తి శాఖ ఫిక్స్ చేసింది. ఎల్లుండి మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, సాగునీటి ప్రాజెక్టుల వివాదాలపై వీరిద్దరూ చర్చించనున్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. గత ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిశారు. బనకచర్ల ప్రాజెక్ట్ పై తమ అభ్యంతరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఎల్లుండి ఏపీ, తెలంగాణ సీఎంలు భేటీ కానున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ పై చంద్రబాబుతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇటు గోదావరి, కృష్ణా జలాల వివాదాలపై చంద్రబాబుతో చర్చించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం