సౌదీలో యూరోపియన్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ సస్పెండ్..!!

- July 15, 2025 , by Maagulf
సౌదీలో యూరోపియన్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ సస్పెండ్..!!

రియాద్:  తీవ్రమైన చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడిన యూరోపియన్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్ చేసినట్టు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ప్రకటించింది. SFDA ఇన్స్పెక్టర్లు ఫ్యాక్టరీ తయారీ విధానాలు, అంతర్గత నాణ్యత వ్యవస్థలలో ప్రాథమిక లోపాలను గుర్తించిన తర్వాత ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇది సౌదీ అరేబియాకు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ఔషధ ఉత్పత్తుల భద్రతకు ప్రత్యక్ష ప్రమాదాన్ని కలిగిస్తుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా అనేక యూరోపియన్ నియంత్రణ సంస్థలు SFDA టెక్నికల్ ఫలితాలను పరిశీలించడానికి, తదుపరి చర్యలు తీసుకోవడానికి SFDAని సంప్రదించాయని తెలిపింది.

విదేశీ తయారీ సైట్‌ల పర్యవేక్షణ కీలకమని, తనిఖీలు నిరాంతరాయంగా కొనసాగుతాయని అథారిటీ స్పష్టం చేసింది. వినియోగదారుల భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. భద్రతా ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినట్లు తేలిన ఏ తయారీదారుపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని అథారిటీ హెచ్చరించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com