శుభాంశు శుక్లా ఆగస్టు 17 నాటికి భారత్‌కు వచ్చే అవకాశం
- July 15, 2025
అమెరికా: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా మంగళవారం భూమిపైకి వచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలోని కెలిఫోర్నియాకు సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో ఇతర సిబ్బందితో కలిసి ఆయన దిగారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోనే ఉన్నారు. శుభాంశు శుక్లా ఆగస్టు 17న భారత్‌కు రానున్నారు.
స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ నౌకలో శుభాంశు శుక్లా అమెరికాకు చెందిన పెగ్గీ విట్‌సన్, పోలాండ్ కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ తో కలిసి యాక్సియం మిషన్ 4 పూర్తిచేశారు. ఈ నలుగురు వ్యమగాములు 20 రోజుల అంతరిక్ష యాత్ర అనంతరం భూమి వాతావరణంలో ప్రవేశించి పసిఫిక్ మహాసముద్రంలో దిగారు.
స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ డీ ఆర్బీట్ బర్న్ చేసి వారు భూమివైపునకు వచ్చారు. ముందుగా డ్రోగ్ ప్యారాచ్యూట్లు, అనంతరం ప్రధాన ప్యారాచ్యూట్లను తెరచి నీటిలో దిగే ప్రక్రియను ప్రారంభించారు. ప్యారాచ్యూట్ల సాయంతో క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రం వైపు దిగి వచ్చింది.
భూమిపైకి వచ్చాక కమాండర్ పెగ్గీ విట్‌సన్ మాట్లాడుతూ.. “థ్యాంక్యూ… తిరిగొచ్చినందుకు ఆనందంగా ఉంది” అని అన్నారు. ఈ నలుగురు జూన్ 25న కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయాణించారు. 20 రోజుల అంతరిక్షయానంలో భాగంగా సుమారు 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు.
శుభాంశు శుక్లా భూమిని చేరిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో స్పందించారు. శుభాంశు శుక్లా ధైర్యం, అంకితభావం, ముందడుగు వేయాలన్న సంకల్పం దేశ ప్రజల్లో కోటి కలలు నింపాయని పేర్కొన్నారు. “అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను దేశం తరఫున ఆహ్వానిస్తున్నాను” అని మోదీ తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా ఘనత సాధించినట్లు మోదీ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







