ఒమన్ కైట్ ఫెస్టివల్ 2025.. బార్ అల్ హిక్మాన్ తీరంలో సందడి..!!
- July 16, 2025
మస్కట్: దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్‌లోని బార్ అల్ హిక్మాన్ సుందరమైన తీరంలో ఒమన్ కైట్ ఫెస్టివల్ 2025 ప్రారంభమైంది. ఈ ఉత్సవాన్ని ఒమన్ సెయిల్, విజిట్ ఒమన్, ఒమన్ అడ్వెంచర్ సెంటర్ సహకారంతో ఒమ్రాన్ గ్రూప్ నిర్వహిస్తోంది. సహజమైన తీరప్రాంతాన్ని ప్రదర్శిస్తూనే.. క్రీడలు, సాహస పర్యాటకానికి ప్రధాన గమ్యస్థానంగా ఒమన్‌ను నిలపడమే ఈవెంట్ లక్ష్యమని వెల్లడించారు.
బార్ అల్ హిక్మాన్ తీరంలో అధికారిక ప్రారంభోత్సవం ఒమ్రాన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ హషిల్ బిన్ ఒబైద్ అల్ మహ్రౌకి, ఒమన్ సెయిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఖామిస్ బిన్ సలేం అల్ జాబ్రీ సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ఒమ్రాన్ గ్రూప్ ప్రతినిధి సుల్తాన్ బిన్ సులైమాన్ అల్ ఖుదూరి మాట్లాడుతూ.. ఒమన్ పర్యాటక రంగాన్ని ఇది మరింత పైకి తీసుకువెళుతుందన్నారు. జాతీయ పర్యాటక వ్యూహం 2040 లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఉత్సవం ప్రతిబింబిస్తుందన్నారు.
ఈ ఫెస్టివల్ లో ప్రపంచవ్యాప్తంగా 90 మందికి పైగా.. వివిధ రేసుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. "ఒమన్ డౌన్వైండర్" లో భాగంగా సిగ్నేచర్ రేసు నాలుగు దశల్లో జరుగుతుంది. బార్ అల్ హిక్మాన్ నుండి మాసిరా ద్వీపం వరకు, మాసిరా ద్వీపం నుండి రాస్ అల్ రువైస్ ద్వారా, తరువాత పింక్ లగూన్స్ నుండి అల్ అష్ఖరా వరకు, రాస్ అల్ జింజ్ నుండి రాస్ అల్ హాడ్ వరకు రేసు ఉంటుందన్నారు. వీటితోపాటు బార్ అల్ హిక్మాన్లో కైట్ కోర్స్ రేస్, మాసిరా ద్వీపంలో కోస్టల్ రేస్, రాస్ అల్ హాడ్లో స్లాలొమ్ రేస్ వంటి అనేక ప్రత్యేక కైట్స్ రేసులు కూడా ఉంటాయని వివరించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!