యూఏఈలో పెరుగుతున్న సోలో డ్రైవింగ్.. నిరాశ, చిరాకు, ఒత్తిడి..!!
- July 16, 2025
యూఏఈ: యూఏఈలో రోడ్ సేఫ్టీపై అల్ వాత్బా నేషనల్ ఇన్సూరెన్స్ చేసిన తాజా సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరుగుదల డ్రైవర్లపై తీవ్రమైన ఒత్తిడికా కారణం అవుతుంది. అధిక స్థాయిల ఒత్తిడి కారణంగా నిరాశకు లోనవ్వడమే కాకుండా, రోడ్డుపై మొరటుగా లేదా దూకుడుగా ప్రవర్తిస్తున్నట్లు నివేదిక తెలిపింది. సర్వేలో 10 మందిలో ఎనిమిది మంది లేదా 82 శాతం మంది రోడ్డుపై చాలా తరచుగా లేదా కొన్నిసార్లు మొరటుగా లేదా దూకుడుగా ప్రవర్తించడాన్ని చూశామని చెప్పారు.
"రహదారి భద్రతా కోణంలో ట్రాఫిక్ రద్దీని నివారించాలి. ట్రాఫిక్ జామ్‌లలో యూఏఈ వాహనదారులు చాలా దురుసుగా లేదా దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. అందువల్ల, మర్యాదపూర్వక వ్యవహారాలపై అవగాహన పెంచాలి" అని రోడ్‌సేఫ్టీ యూఏఈ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎడెల్మాన్ పేర్కొన్నారు. దాదాపు సగం మంది (47 శాతం) నిరాశ, చిరాకు, చాలా ఒత్తిడి లేదా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల్లో ఇది తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు. కేవలం 29 శాతం మంది మాత్రమే ట్రాఫిక్ రద్దీకి అలవాటు పడ్డారని లేదా ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉంటారని తెలిపారు. ఇక, 19 శాతం మంది తాము రద్దీపట్ల విసుగు చెందుతామని లేదా విశ్రాంతి తీసుకోలేదని చెప్పారట. 5 శాతం మంది ట్రాఫిక్ జామ్‌ల సమయంలో డౌన్‌టైమ్‌ను కూడా ఆనందిస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు.
షార్జా, దుబాయ్‌లలో దాదాపు 90 శాతం లేదా 10 మంది వాహనదారులలో 9 మంది తాము సాధారణంగా ట్రాఫిక్ రద్దీని అనుభవిస్తున్నామని చెప్పారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని దాదాపు 80 శాతం మంది పేర్కొన్నారు. దుబాయ్ 85 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది.
యూఏఈలో కార్లపై ఆధారపడటం చాలా ఎక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. ఎందుకంటే 92 శాతం మంది తమ సొంత కారు, బస్సు, మినీబస్సు లేదా టాక్సీ సేవలను ఉపయోగించడం ద్వారా ప్రతిరోజూ దానిపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. కేవలం 8 శాతం మంది మాత్రమే మెట్రో లేదా ఇ-స్కూటర్, సైకిల్, ఇ-బైక్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. 60 శాతం మంది తమ సొంత కారులో రోజువారీ ప్రయాణానికి వెళుతున్నారు. ఇందులో సగానికి పైగా (54 శాతం) తమ కారులో ఒంటరిగా ప్రయాణిస్తారు. షార్జాలో 62 శాతం మంది వాహనదారులు సాధారణంగా ఒంటరిగా ప్రయాణిస్తారు.
రోడ్డుపై వాహనాల సంఖ్యను తగ్గించాల్సిన అవసరాన్ని సర్వే స్పష్టం చేసింది. దుబాయ్‌లో, 43 శాతం వాహనదారులు సాధారణంగా ఒకరు లేదా ఇద్దరు ప్రయాణీకులను తీసుకువెళతారని, దీనికి గల కారణాలను మరియు ఇతర ఎమిరేట్‌లు, ముఖ్యంగా షార్జా దీని నుండి ఎలా నేర్చుకోవచ్చో అర్థం చేసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది అని సర్వే పేర్కొంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!