ఖతార్ లో 18 బీచ్‌ల పునరుద్ధరణ..!!

- July 17, 2025 , by Maagulf
ఖతార్ లో 18 బీచ్‌ల పునరుద్ధరణ..!!

దోహా: పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) సహకారంతో పబ్లిక్ బీచ్‌లను పునరుద్ధరించడానికి.. వాటిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఒక జాతీయ ప్రాజెక్టును ప్రారంభించినట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖలోని ప్రాజెక్ట్స్ మేనేజ్‌మెంట్, అభివృద్ధి విభాగం డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ అల్ రుమైహి వెల్లడించారు.

ఈ ప్రాజెక్టులో దేశవ్యాప్తంగా 18 బీచ్‌లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మునిసిపాలిటీలు, ప్రైవేట్ రంగాల సహకారంతో బీచ్ ల అభివృద్ధి జరుగుతుందని ఆయన వెల్లడించారు. మొదటి దశలో సిమైస్మా, అల్ వక్రా, సీలైన్, అల్ ఫార్కియా, అల్ ఘరియా, సఫా అల్ టౌక్, అల్ ఖరైజ్‌లలో ఎనిమిది ప్రధాన బీచ్‌లలో అమలు అవుతుందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com