హెల్త్‌కేర్ సిటీ ఎగ్జిట్ వద్ద ముఖ్యమైన ట్రాఫిక్ అప్‌గ్రేడ్‌లు..!

- July 18, 2025 , by Maagulf
హెల్త్‌కేర్ సిటీ ఎగ్జిట్ వద్ద ముఖ్యమైన ట్రాఫిక్ అప్‌గ్రేడ్‌లు..!

దుబాయ్: వారాంతంలో దుబాయ్ హెల్త్‌కేర్ సిటీ నుండి షేక్ జాయెద్ రోడ్‌కు రాకపోకలు సాగిస్తున్నారా? వాహనదారులు, టాక్సీ ప్రయాణికుల కోసం కొన్ని మార్పులను చేశారు. దీని వలన వారు దుబాయ్ లైఫ్‌లైన్‌కు కనెక్ట్ అవ్వడం సులభం అవుతుందన్నారు. ట్రాఫిక్ ప్రవాహాన్ని పెంచడానికి, దుబాయ్ రోడ్ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) దుబాయ్ హెల్త్‌కేర్ సిటీ ఎగ్జిట్ (స్ట్రీట్ 13) వద్ద ట్రాఫిక్ అప్డేట్ లను ఖరారు చేస్తోంది.  ఇవి జూలై 20 నాటికి పూర్తవుతాయని అధికారులు ప్రకటించారు. 

ఈ ప్రాజెక్ట్‌లో ఔద్ మేథా, షేక్ రషీద్ రోడ్ కూడలికి దారితీసే కొత్త యాక్సిలరేషన్ లేన్‌ను కలపడం ద్వారా ప్రస్తుత స్టాప్-కంట్రోల్డ్ ఎగ్జిట్‌ను ఫ్రీ-ఫ్లో గా మారుతుంది. దీంతోపాటు సర్వీస్ రోడ్ ఎగ్జిట్ ను 500 మీటర్ల విస్తీర్ణంలో ఒక లేన్ నుండి రెండు లేన్‌లకు విస్తరించనున్నారు.  అల్ రియాద్ స్ట్రీట్ నుండి ఔద్ మేథా, షేక్ రషీద్ రోడ్ల కూడలి వైపు వెళ్లే వాహనాలకు అవకావం కల్పిస్తారు.  

దుబాయ్ హెల్త్‌కేర్ సిటీ ఎగ్జిట్ వద్ద షేక్ జాయెద్ రోడ్ వరకు అప్‌గ్రేడ్ కారణంగా ట్రాఫిక్ ను గంటకు 3,000 వాహనాల సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుందన్నారు. ఈ కీలకమైన కారిడార్‌లో ట్రాఫిక్ వేగాన్ని మెరుగుపరుస్తుంది. ఈ అప్డేట్ ల కారణంగా రద్దీతోపాటు సగటు వేగం, సమయాలను 50% వరకు తగ్గిస్తాయని భావిస్తున్నారు.

RTA గతంలో అదే ప్రాంతంలో కీలక అప్డేట్ లు చేపట్టింది.  ఉమ్ హురైర్,  ఔద్ మేథా మధ్య ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లకు అప్‌గ్రేడ్‌లు చేశారు. ఇక్కడ రెండు దిశలలో వాహనాల కదలికను క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకున్నారు. ఉమ్ హురైర్ రోడ్డులోని సర్వీస్ రోడ్ ఎగ్జిట్ ను రెండు లేన్ల నుండి రౌండ్అబౌట్ వైపు మూడు లేన్లకు విస్తరించింది. ట్రాఫిక్ సామర్థ్యాన్ని 50% పెంచింది. రద్దీ సమయాల్లో రద్దీని 40% కంటే ఎక్కువ తగ్గించిందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com