చక్కెర స్థాయిల పై ఆధారపడి డ్రింక్స్ పై ట్యాక్స్..!!
- July 19, 2025
యూఏఈ: యూఏఈలో ఆహారాన్ని ఆరోగ్యకరమైనదిగా మార్చే లక్ష్యంతో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫెడరల్ టాక్స్ అథారిటీ తీపి పానీయాలకు పన్నులు వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. తీపి పానీయాలపై వర్తించే పన్ను ఆయా ఉత్పత్తిలో వాటి చక్కెర కంటెంట్ ఆధారంగా ఉంటుందని అథారిటీ తెలిపింది. ఇది 50 శాతం వరకు ఎక్సైజ్ ట్యాక్స్ కింద వసూలు చేయనున్నట్లు తెలిపారు. చక్కెర కంటెంట్ తగ్గింపును ప్రోత్సహించడం ద్వారా నివాసితులకు ఆరోగ్యకరమైన డ్రింక్స్ లను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ విధానం సహాయపడుతుందన్నారు.
ఎక్సైజ్ పన్ను అంటే ఏమిటి?
ప్రజల ఆరోగ్యానికి లేదా పర్యావరణానికి సాధారణంగా హాని కలిగించే నిర్దిష్ట వస్తువులపై ఎక్సైజ్ పన్ను విధించబడుతుంది. దీని అమలు అటువంటి ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని ముఖ్యమైన ప్రజా సేవలలో తిరిగి పెట్టుబడి పెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. 2017లో యూఏఈ కొన్ని ఉత్పత్తులపై ఈ పన్ను విధించింది. ఇందులో కార్బోనేటేడ్ పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, పొగాకుతో కూడిన ఉత్పత్తులు ఉన్నాయి. 2019లో, దీనిని ఎలక్ట్రానిక్ ధూమపాన పరికరాలు, అటువంటి పరికరాల్లో ఉపయోగించే లిక్విడ్స్, తీపి పానీయాలను చేర్చడానికి విస్తరించారు.
అబుదాబి ఇటీవల పాఠశాలల్లో జంక్ ఫుడ్పై నిషేధాన్ని ప్రకటించడంతో యూఏఈ నివాసితులలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నిరంతరం ప్రోత్సహిస్తోంది.
ఇది ఎంత?
- ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులపై విధించే పన్నుల పూర్తి జాబితా:
- కార్బోనేటేడ్ పానీయాలపై 50 శాతం
- పొగాకు ఉత్పత్తులపై 100 శాతం
- శక్తి పానీయాలపై 100 శాతం
- ఎలక్ట్రానిక్ ధూమపాన పరికరాలపై 100 శాతం
- అటువంటి పరికరాలలో ఉపయోగించే లిక్విడ్స్ పై 100 శాతం
- చక్కెర లేదా ఇతర స్వీటెనర్లు ఉన్న ఏదైనా ఉత్పత్తిపై 50 శాతం
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం