ఈ సమ్మర్ లో 21°C వాతావరణం కావాలా? ఛలో జెబెల్ జైస్..!!
- July 19, 2025
యూఏఈ: దుబాయ్లో ఉష్ణోగ్రతలు 45°C దాటడంతో అక్కడి వారందరూ సేదతీరేందుకు జెబెల్ జైస్ కు తరలివెళుతున్నారు. అక్కడ 21°C ఉష్ణోగ్రతలతో చల్లగా ఉండటంతో అందరూ వెకేషన్ కోసం అక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
దుబాయ్, షార్జాలో ఉష్ణోగ్రతలు 45°C కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈ నివాసితులు దేశంలోని ఎత్తైన పర్వత ప్రాంతమైన జెబెల్ జైస్ వద్ద సేదతీరేందుకు బారులు కడుతున్నారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఇప్పుడు రాత్రిపూట 21°Cకి, పగటిపూట 27°C వరకు నమోదవుతున్నాయి.
అధిక విమాన ఛార్జీలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఈ వేసవిలో చాలా మంది అంతర్జాతీయ ప్రయాణాలను చేయలేకపోతున్నారు. దాంతో అనేక కుటుంబాలు, స్నేహితుల గ్రూప్ లు రాస్ అల్ ఖైమా పర్వతాలపై నైట్ క్యాంపింగ్ చేయడానికి, బార్బెక్యూలను ఆస్వాదించడానికి
జెబెల్ జైస్ కొత్త వేసవి హాట్స్పాట్
చల్లని ఉష్ణోగ్రతలు: గరిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్,కనిష్టంగా 21 డిగ్రీల సెల్సియస్. ఇది నగరంలోని వేడి వాతావవరణం నుండి భారీ ఉపశమనం అందజేస్తుంది.
చేరుకోవడం సులభం: దుబాయ్, షార్జా లేదా అబుదాబి నుండి కేవలం 1.5 నుండి 2 గంటల ప్రయాణం.
బడ్జెట్-ఫ్రేండ్లీ: విమాన టిక్కెట్లు లేదా హోటల్ బుకింగ్లు లేవు. ఇంధనం, ఆహారం ఉంటే చాలు.
సురక్షితమైన ప్రాంతం: చక్కటి నిర్వహణతో ఉండే రోడ్లు, పబ్లిక్ టాయిలెట్లు, పుష్కలంగా లాన్స్ , కుటుంబాలతోపాటు స్నేహితులతో సరదాగా టైమ్ ను గడపవచ్చు.
టూర్ ప్లాన్ టిప్స్
-మధ్యాహ్నం ఆలస్యంగా లేదా రాత్రిపూట ఉత్తమ చల్లని వాతావరణాన్ని ఆస్వాదించడానికి ప్లాన్ చేసుకోవాలి.
-చల్లగా ఉంటుంది కాబట్టి రాత్రిపూట వెచ్చని బట్టలు ఉండేలా చూసుకోవాలి.
-మ్యారినేట్ చేసిన ఆహారం, పోర్టబుల్ గ్రిల్, నీరు, చెత్త సంచులను వెంట తెచ్చుకోవల్సిందే.
తాజా వార్తలు
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల







