దుబాయ్‌లో 13వ 'సైమా' వేడుకకు రంగం సిద్ధం...

- July 19, 2025 , by Maagulf
దుబాయ్‌లో 13వ \'సైమా\' వేడుకకు రంగం సిద్ధం...

సౌత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న SIIMA  2025(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)వేడుకకు రంగం సిద్ధమైంది.ఈ ఏడాది జరగనున్న 13వ ఎడిషన్ 'సైమా' ఈవెంట్ కి  సంబంధించిన తేదీలను  ప్రకటించారు.సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయ్‌ వేదికగా ఈ ఉత్సవం జరగనుంది.ఈ విషయాన్ని 'సైమా' నిర్వహణ కమిటీ ఎక్స్ లో అధికారికంగా ప్రకటించింది.   

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి ఉత్తమ ప్రతిభను కనబరిచిన చిత్రాలను, నటీనటులను గుర్తించి సత్కరించే అంతర్జాతీయ వేదిక సైమా. గత రెండు సంవత్సరాలు  కూడా సైమా వేడుకలు దుబాయ్‌ వేదికగానే జరిగాయి. 9వ ఎడిషన్ మాత్రం హైదరాబాద్ వేదికగా జరిగింది. 2012లో మొదలైన సైమా అవార్డుల ఉత్సవం ఇప్పటికీ.. 12 ఎడిషన్ లు పూర్తిచేసుకుంది. 

 

 

https://x.com/siima/status/1946156274984583583

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com