షార్జాలో అపార్ట్‌మెంట్‌లో మహిళ అనుమానస్పద మృతి..!!

- July 21, 2025 , by Maagulf
షార్జాలో అపార్ట్‌మెంట్‌లో మహిళ అనుమానస్పద మృతి..!!

షార్జా: షార్జాలోని రోల్లా పార్క్ సమీపంలోని తన అపార్ట్‌మెంట్‌లో 30 ఏళ్ల భారతీయ మహిళ అనుమానస్పద రీతిలో మృతి చెందింది. అతుల్య శేఖర్‌గా గుర్తించబడిన ఆ మహిళ, సమీపంలోని మాల్‌లో ఉన్న ఒక కంపెనీలో కొత్త ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈలోగానే అనుమానస్పదన రీలితో మరణించి కనిపించిందని సామాజిక కార్యకర్తలు తెలిపారు.  
ఈ విషాద సంఘటనకు సంబంధించి భారత కాన్సులేట్ ఒక ప్రకటన విడుదల చేసింది. “అతుల్య శేఖర్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.మా బృందం వారి కుటుంబం మరియు షార్జా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మేము సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తున్నాము.” అని కాన్సులేట్ ప్రెస్ వింగ్ తెలిపింది.
సామాజిక కార్యకర్త అబ్దుల్లా కమమలం ప్రకారం.. అతుల్య గత రెండు సంవత్సరాలుగా షార్జాలో నివసిస్తున్నారు. ఆమె తన పుట్టినరోజును సమీపంలో నివసించే తన సోదరితో కలిసి జరుపుకుంది.త్వరలోనే తను ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపిందని పేర్కొన్నారు.  కాగా, 2014 లో వివాహం జరిగిందని, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని ప్రాథమికంగా తెలుస్తుందని తెలిపారు. అతుల్య భర్తతో కలిసి ఉంటుండగా, వాళ్లకు 10 ఏళ్ల కుమార్తె(ఇండియాలో చదువుకుంటుంది) ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com