G20 శిఖరాగ్ర సమావేశంలో తక్షణ సంస్కరణలకు సౌదీ పిలుపు..!!

- July 21, 2025 , by Maagulf
G20 శిఖరాగ్ర సమావేశంలో  తక్షణ సంస్కరణలకు సౌదీ పిలుపు..!!

కేప్ టౌన్: దక్షిణాఫ్రికా అధ్యక్షతన జూలై 17–18 తేదీలలో జరిగిన మూడవ G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో  సౌదీ ఆర్థిక మంత్రి మొహమ్మద్ అల్-జాదాన్ పాల్గొని, తక్షణ సంస్కరణకు పిలుపునిచ్చారు. మారుతున్న ఆర్థిక వాస్తవాలకు ప్రతిస్పందనగా ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో సంస్కరణలను వేగవంతం చేయవలసిన తక్షణ అవసరాన్ని తెలియజేశారు. “ఫైనాన్సింగ్ అవసరాలు పెరుగుతున్న సమయంలో అధిక రుణ ఖర్చులు..ప్రభుత్వాలు,ప్రైవేట్ రంగం రెండింటిపై ఒత్తిడి పెరుగుతోంది” అని అల్-జాదాన్ తన ప్రసంగంలో అన్నారు. ఆర్థిక ఒత్తిడి లేదా స్వల్పకాలిక ద్రవ్యత సవాళ్లను ఎదుర్కొంటున్న దేశాలకు మద్దతు ఇవ్వడం కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  
దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్‌లో జరిగిన ఈ సమావేశంలో G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లు, ఆహ్వానించబడిన దేశ ప్రతినిధులు, అంతర్జాతీయ, ప్రాంతీయ ఆర్థిక సంస్థల అధిపతులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com