యూఏఈలో లాంగ్ వీకెండ్ లు, మెగా షోలు?

- July 21, 2025 , by Maagulf
యూఏఈలో లాంగ్ వీకెండ్ లు, మెగా షోలు?

యూఏఈ: ప్రతి డిసెంబర్‌లో ఏడు ఎమిరేట్స్ చారిత్రాత్మక ఏకీకరణను జరుపుకోవడానికి సిద్ధమవుతుండటంతో  యూఏఈ అంతటా పండుగ వాతావరణం నిండి ఉంటుంది. డిసెంబర్ 2న ఈద్ అల్ ఎతిహాద్ 'యూనియన్ పండుగ' అనే పేరుతో జరుపుకుంటుంది. 1971లో అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్ మరియు ఫుజైరా పాలకులు కలిసి యూనియన్‌ను ఏర్పాటు చేశారు. 1972 ప్రారంభంలో రస్ అల్ ఖైమా చేరింది. దీనితో యూఏఈ ఏర్పడింది.  


ప్రభుత్వ సెలవులు
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు  డిసెంబర్ 2, 3 తేదీలలో రెండు రోజుల సెలవులు ఉంటాయి. డిసెంబర్ 3 కలిపి వీకెండ్ సెలవులు లభిస్తాయి. డిసెంబర్ 1(సోమవారం), గురువారం, శుక్రవారం (డిసెంబర్ 4, 5)  సెలవు కోసం దరఖాస్తు చేసుకోవడం ద్వారా దీన్ని వారం రోజుల వీకెండ్ గా మార్చుకోవచ్చు. రెండు వారాంతాలను కలుపుకుంటే ఈ సంవత్సరాన్ని ముగించడానికి 9 రోజుల సెలవు లభించినట్టు అవుతుందని అధికారులు తెలిపారు.

ప్రత్యేక కార్యక్రమాలు
అన్ని ఎమిరేట్స్ (దుబాయ్, అబుదాబి, షార్జా, రస్ అల్ ఖైమా) అంతటా భారీ ఫైర్ వర్క్స్.
పరేడ్ లు (డౌన్‌టౌన్ దుబాయ్, గ్లోబల్ విలేజ్, సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ కాన్సర్టులు) వంటి ఉచిత ప్రజా కార్యక్రమాలు.
మాల్స్, రెస్టారెంట్లు , హోటళ్ళలో డిస్కౌంట్లు,  ఆఫర్‌లు.
ట్రాఫిక్ జరిమానా తగ్గింపు.. 2024లో ట్రాఫిక్ జరిమానాలపై 50 శాతం తగ్గింపు అందించారు.
వాహనదారులకు ఉచిత పబ్లిక్ పార్కింగ్ సదుపాయం అందిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com