టీటీడీ కీలక నిర్ణయం..

- July 21, 2025 , by Maagulf
టీటీడీ కీలక నిర్ణయం..

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాసాంధ్రులకు సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం లభించేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనాల కోటాను పెంచింది. ప్రస్తుతం రోజులో 25 వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్న టీటీడీ..వాటిని 01 ఆగష్టు నుంచి 50కు పెంచే అవకాశముంది.దీంతో ప్రవాసాంధ్రులకు ప్రతీరోజూ 50 వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

దీంతో విదేశాల నుంచి వచ్చే తెలుగు ప్రజలు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ (APNRT) అధ్యక్షుడు రవి వేమూరి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.సానుకూలంగా స్పందించిన చంద్రబాబు.. ప్రవాసాంధ్రులకు ప్రతీరోజూ 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీకి సూచించారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రవాసాంధ్రులకు ప్రతీరోజూ 100 వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లు మంజూరు చేసే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com