మహిళల ప్రపంచ కప్ లో చరిత్ర సృష్టించిన కోనేరు హంపి
- July 21, 2025
భారత చెస్ ప్రపంచంలో మరో గర్వకారణమైన ఘట్టం చేరింది. తెలుగు రత్నం కోనేరు హంపి ఫిడే మహిళల చెస్ వరల్డ్‌కప్ 2025లో సెమీఫైనల్‌కి చేరిన తొలి భారత మహిళగా చరిత్రలో నిలిచింది. జార్జియాలో జూలై 5 నుండి 29 వరకు జరుగుతున్న ఈ పోటీలో హంపి తన అద్భుతమైన వ్యూహాలతో అందరిని ఆకట్టుకుంది.క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్‌ను 1.5-0.5 తేడాతో ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది. మొదటి గేమ్‌లో తెల్ల పావులతో ఇంగ్లిష్ ఓపెనింగ్‌ను ప్రదర్శించి, కటలాన్ నిర్మాణంలోకి పయనించిన హంపి 5 3 ఎత్తుల్లో గేమ్‌ను గెలిచింది. రెండవ గేమ్‌లో సాంగ్ జోబావా లండన్ సెటప్‌తో ఆడినా, హంపి రెండు పావులను త్యాగం చేసి, కౌంటర్ ప్లే సాధించింది. చివరకు డ్రా చేసి మొత్తం స్కోర్‌ను 1.5-0.5గా మార్చింది.
గ్రాండ్‌మాస్టర్ టైటిల్
ఈ విజయంతో హంపి 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించే అవకాశాలను బలపరిచింది. ఈ టోర్నమెంట్ గెలిచిన ఆటగాళ్లు ప్రపంచ చాంపియన్షిప్కి అర్హత పొందతారు. అంటే, హంపి మరోసారి ప్రపంచ టైటిల్ దిశగా అడుగులు వేయనుంది.ఇంతకముందు హంపి 2002లో గ్రాండ్‌మాస్టర్ టైటిల్ (Grandmaster title) సాధించింది. 2019, 2024లో వరల్డ్ రాపిడ్ చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు సెమీఫైనల్ చేరటం, ఆమె సుదీర్ఘ కెరీర్లో మరో గొప్ప ఘట్టం.ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. హంపితో పాటు డి. హరిక, దివ్యా దేశ్‌ముఖ్, ఆర్. వైశాలి కూడా క్వార్టర్ ఫైనల్‌కి చేరారు. ఇది భారత చెస్‌కు గర్వకారణం. హరిక, దివ్యాల మధ్య జరిగిన మ్యాచ్ టైబ్రేక్‌కి వెళ్లగా, వైశాలి మాత్రం తాన్ జాంగ్‌యీ చేతిలో ఓడింది.
రెండో గేమ్
సెమీఫైనల్లో టాప్ సీడ్ లీ టింజీ(చైనా)తో హంపి అమీతుమీ తేల్చుకోనుంది. టింజీ క్వార్టర్స్‌లో 2-0తో జార్జియా ప్లేయర్ ననా జాగ్నిజెను ఓడించింది. మరోవైపు ఇద్దరు భారత అమ్మాయిలు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్ మధ్య క్వార్టర్స్ ఫలితం సోమవారం టై బ్రేక్స్‌లో తేలనుంది. ఈ ఇద్దరి మధ్య రెండో గేమ్ కూడా డ్రాగా ముగియడంతో ట్రై బ్రేక్స్ తప్పలేదు. వైశాలి టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్స్‌లో ఆమె 0.5-1.5తో తాన్ జ్యోంగి చేతిలో ఓడింది. రెండో గేమ్‌లో వైశాలి ఓటమి చవిచూసింది. ఈ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులు మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు.
భారతదేశంలో అత్యంత ధనవంతుడైన చెస్ ఆటగాడు ఎవరు?
భారతదేశంలో అత్యంత ధనవంతుడైన చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్.
ఆయన 1988లో భారతదేశపు మొట్టమొదటి గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందారు.
కోనేరు హంపి ప్రపంచ చెస్ చాంపియన్?
అవును, కోనేరు హంపి ప్రస్తుతం మహిళల వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్.
ఆమె డిసెంబర్ 2024లో ఈ టైటిల్ గెలిచింది.ఇది ఆమెకు రెండోసారి రాపిడ్ ప్రపంచ చాంపియన్‌షిప్ గెలిచిన సందర్భం.ఆమె మొదటిసారి 2019లో కూడా ఈ టైటిల్‌ను గెలుచుకుంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!