పార్టీ ప్రయోజనాల కంటే దేశమే గొప్ప: ప్రధాని మోదీ
- July 21, 2025
న్యూఢిల్లీ: పార్టీ ప్రయోజనాలకంటే దేశమే ముఖ్యమని పేర్కొన్నారు భారత ప్రధాని మోదీ.. ఆపరేషన్ సిందూర్ తో మన ఆర్మీ శక్తిసామార్ద్యాలు ప్రపంచ దేశాలు గర్తించాయని చెప్పారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల కోసం లోక్ సభకు వచ్చే ముందు ప్రధాని మీడియాతో మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్‌లో మన దేశ సైనికుల సత్తా చూశామన్నారు. అందులో వందశాతం లక్ష్యాలను సాధించమని చెప్పారు. కచ్చితమైన లక్ష్యంతో కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని అంటూ . ఈ ఆపరేషన్‌తో మేడిన్ ఇండియా సైనిక సామర్థ్యం, గొప్పతనం ఏంటో ప్రపంచం చూసిందన్నారు ప్రధాని. ఆపరేషన్ సిందూర్‌పై మన ఎంపీలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యటించి వివరించారని ప్రధాని గుర్తుచేశారు. పాక్ దుష్ట చర్యలను అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టారని అన్నారు. . ఈ మధ్య కాలంలో తాను ఎవరిని కలిసినా మేడిన్ ఇండియా ఆయుధాల గురించే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మన ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందని పేర్కొన్నారు. తుపాకులు, బాంబుల ముందు మన రాజ్యాంగం బలంగా నిలబడిందని తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని వేడుక చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదం కావాలని ఆకాక్షించారు.
దేశ ప్రగతి కోసం అందరూ కలిసి నడవాల్సిన సమయమిది అని పిలుపు ఇచ్చారు. ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటికే 90 శాతం నక్సలైట్ల స్థావరాలను ధ్వంసం చేశామని చెప్పారు.. కలుగులో ఉన్న మావోయిస్ట్ లను బయటకు రప్పించామన్నారు..దేశంలో నక్సల్ ఉధ్యమం అంతరించినట్లేనని అన్నారు.. ప్రస్తుతం.మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని మోదీ వెల్లడించారు.
శుభాంశు యాత్ర స్ఫూర్తిదాయకం.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మన మువ్వనన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు మోదీ. అంతరిక్ష యాత్రలో ఇదో ప్రేరణ అని, . ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది అని మోదీ ప్రశంసించారు. దేశవ్యాప్తంగా వర్షాలు బాగా కురుస్తున్నాయని, ఇది రైతులకు ఎంతో లాభదాయకమని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడ్డాయని తెలిపారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







