హైదరాబాద్ లో హరి హర వీర మల్లు ప్రెస్ కాన్ఫరెన్స్
- July 21, 2025
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ హరి హర వీరమల్లు జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో చిత్ర బృందం నేడు హైదరాబాద్‌లో స్పెషల్ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు.
‘నేను యాక్సిడెంటల్‌గా నటుడిని అయ్యాను. గచ్చతరం లేక టెక్నీషియన్ అయ్యాను. సినిమాల్లో నటించడం తప్ప సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. ఏఎం రత్నం కోసమే మీడియా ముందుకు వచ్చాను.సినిమా బతకాలి. ఆయన కష్టానికి ఫలితం దక్కాలి అని ప్రెస్‌మీట్‌ను నిర్వహిస్తున్నాం. ‘అని పవన్ అన్నారు.
‘నేను పాలిటిక్స్ వలన సినిమాకు దూరంగా వెళ్లిన కూడా నేను మళ్ళి సినిమా చేయాలనీ రత్నం అడిగినపుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత ఈ సినిమా కోసం ఇచ్చాను.నేను ఉన్న పరిస్థితుల్లో సినిమా కోసం టైమ్ ఇవ్వాలేను. అలాంటిది ఈ సినిమా క్లైమాక్స్ కోసం 57 రోజులు ఇచ్చాను. నా వంతుగా ఎంత చేయాలో అంత సపోర్ట్ ఇచ్చాను.’ అని పవన్ తెలిపారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







