నన్ను అందరూ రీమేక్స్ చేస్తారని అంటారు: పవన్ కళ్యాణ్

- July 21, 2025 , by Maagulf
నన్ను అందరూ రీమేక్స్ చేస్తారని అంటారు: పవన్ కళ్యాణ్

హైదరాబాద్: రికార్డులు కోసం తానెప్పుడూ సినిమాలు చేయలేదని, సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప తనకేమీ కోరికలూ లేవని అగ్ర కథానాయకుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ అన్నారు.

పవన్ కథానాయకుడిగా నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘హరి హర వీరమల్లు’ క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకులు. నిధి అగర్వాల్‌ కథానాయిక. ఏఎం రత్నం నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీఈ నెల 24న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో నేడు జరిగిన ప్రీ-రిలీజ్‌ వేడుకలో పవర్ స్టార్ మాట్లాడుతూ,.. “ఉదయం ఏఎం రత్నం గురించి మాట్లాడాను, ఇప్పుడు అభిమానుల గురించి మాట్లాడుతాను” అంటూ మొదలుపెట్టిన ఆయన, “తాను పడుతూ లేస్తూ ఉన్నానంటే దానికి కారణం అభిమానులే” అని, “పడినప్పుడు ఓదార్చి, లేచినప్పుడు అభినందిస్తూ తనకు అండగా నిలబడ్డారు” అని చెప్పుకొచ్చారు.

నేను రాజకీయాల్లోకి వచ్చాక మంచి స్నేహితుడిని సంపాదించుకున్నా. ఆయనే కర్ణాటక మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే. కర్ణాటక నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ‘భీమ్లా నాయక్‌’ విడుదలైనప్పుడు అందరి సినిమాల టికెట్‌లు రూ.100ల్లో ఉంటే.. పవన్‌ సినిమా టికెట్‌ను రూ.10, రూ.15 చేశారు. నేను ఒకటే చెప్పాను. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’. ఇది డబ్బు కోసమో.. రికార్డులు కోసమో కాదు.. ఇది ధైర్యం కోసం.. సాహసం కోసం.. న్యాయం కోసం నిలబడ్డాం. పవన్‌కల్యాణ్‌ ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదు. సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప నేనేమీ కోరుకోలేదు. నేను ఇక్కడ ఈ స్థాయిలో నిలబడినా, రాజకీయాల్లో పడి లేచినా, కారణం మీరే (అభిమానులు). నా దగ్గర ఆయుధాల్లేవు, గూండాలు లేరు. గుండెల్లో అభిమానులే ఉన్నారు” అని పేర్కొన్నారు.

సినిమా గురించి చెబుతూ, కోహినూర్ గురించి ఈ కథ చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకే క్రిష్ చెప్పిన వెంటనే సినిమా చేశాం. ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్‌లో చాలా నలిగిపోయాం. ఇంత నలిగిన తర్వాత ఈ సినిమా ఎన్ని రికార్డులు చేస్తుందంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఎంత కలెక్షన్ చేస్తుందన్నా నేను చెప్పలేను. నేను ఈ రోజుకి చెబుతున్నాను, సినిమా కోసం మా బెస్ట్ ఎఫర్ట్ పెట్టాం. మీరు అంటారు కదా, డాన్సులు చేయరని, అందుకే మీ కోసం కాలు కదిలించి డాన్సులు కూడా చేశాను.

ఫైట్ చేసి చాలా కాలం అయింది కానీ ఫైట్స్ కూడా కష్టపడి చేశాను. ఈ 18 నిమిషాల క్లైమాక్స్ పార్ట్ నేనే కొరియోగ్రఫీ చేశాను. ఎందుకంటే మీ ధర్మానికి నీవు టాక్స్ కట్టాలంటే ఎదురు తిరిగే పరిస్థితి, అదే క్లైమాక్స్. ఇదేంటంటే, ఆ టైంలో సగటు భారతీయుడు నలిగిన దాన్ని ఈ సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇందులో దాయాల్సిందేమీ లేదు, సస్పెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అభిమానులారా, మీరే నా బలం. నేను కష్టాల్లో ఉన్నా, ఓటమిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అన్నా, మేము మీకు ఉన్నామని చెప్పిన వాళ్లు మీరు. మనల్ని ఎవడ్రా ఆపేది అని నేనంటే, మనల్ని ఎవడన్నా ఆపేదని ముందుకు వచ్చారు. మీకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా, ఈ గుండె ఎవరి కోసం కొట్టుకోదు, మీ కోసమే కొట్టుకుంటుంది, మీ కష్టాల కోసం కొట్టుకుంటుంది. మళ్లీ విశాఖపట్నంలో కలుసుకుందాం అంటూ ఆయన కామెంట్ చేశారు.

రీమేక్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ, “ఎక్కువగా రీమేక్ చేస్తానని తిడతారు. కానీ ఏం చేయమంటారు, నా వెంట పెద్ద దర్శకులు లేరు” అని ఆయన అన్నారు. . నాకు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరూ తెలుసు, కానీ దానివల్ల డబ్బులు రావు. డబ్బులు రావాలంటే సినిమా చేయాలి. కింద నుంచి వచ్చిన వాళ్లం నా వెంట పెద్ద దర్శకులు లేరు” అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా, “ఓ జీ ఓ జీ” అంటూ ఓ జీ నామస్మరణ చేయడం మొదలుపెట్టారు అభిమానులు. దీంతో కల్పించుకున్న పవన్ కళ్యాణ్, “ఓజీ వస్తుంది, ఇది వీర” అని అనడంతో మళ్లీ వీర నామస్మరణ మొదలుపెట్టారు. “నన్ను అందరూ కూడా వీడితో ఈ రీమేక్ చేస్తే పని అయిపోతుంది, డబ్బులు వస్తాయి, వీడితో రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి అని అనుకునేవాళ్లు.

ఎప్పుడూ రీమేక్ తీస్తామని తిడతారు, మరి తీయకపోతే నా పార్టీని ఎవరు నడుపుతారు? కొత్త కథలు తీస్తే ఎప్పుడో వెళ్లిపోతారు. నా భార్యని, పిల్లల్ని ఎవరు పోషిస్తారు? నేనే పోషించుకోవాలి. వాళ్లకి డబ్బులు కావాలి, పార్టీని నడపాలి. వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు ఈజీ దారి అయింది. నేను కొత్త సినిమాలు చేయలేక కాదు, వేరే దారి లేక. నాకు దేశం పిచ్చి, సమాజం పిచ్చి, సినిమా మీద ఉన్న పిచ్చి. అలాంటి నేను ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటే, అది ఏఎం రత్నం గారి ద్వారా వచ్చింది. నాతో బలమైన సినిమా చేయాలని కోరుకున్నాడు. క్రిష్ గారి వల్లే ఈ సినిమా వచ్చింది.” ఈ మూవీ హిందువుగా జీవించాలంటే శిస్తు విధిస్తే తిరుగుబాటుకు దారి తీస్తుంది. ఇది అలాంటి మూవీ అంటూ చెప్పుకొచ్చారు.

నేను పదేళ్ల పాటు ప్లాపుల్లో ఉన్నాను.నేను మొదట్లో వరుస హిట్లు కొడుతున్నప్పుడు ఒక ప్లాప్ మూవీ చేసి పాపం చేశాను. అప్పటి నుంచి మూవవీలపై గ్రిప్ కోల్పోయాను. ఎలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవాలో అర్థం కాలేదు. వరుసగా ప్లాపులు వచ్చాయి. అలా ప్లాపుల్లో ఉన్న టైమ్ లో నా కోసం నిలబడింది త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే. మనం ఆపదలో ఉన్నప్పుడు వచ్చిన వాడే నిజమైన స్నేహితుడు. అప్పటి వరకు అతనెవరో కూడా నాకు తెలియదు. కానీ మేమిద్దరం కలిసి జల్సా మూవీ చేశాం.

ఎవరైనా సక్సెస్ లో వెతుక్కుంటూ వస్తారు. అపజయాల్లో వెతుక్కుంటూ వచ్చిన నా మిత్రుడు ఆత్మ బంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాంటి స్నేహితుడిని భగవంతుడు నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపంలో ఇచ్చాడు అని అన్నారు.

ఇక ‘నాటు నాటు’ పాటతో ప్రపంచం ఉర్రూతలూగించారు కీరవాణి. ఆయన మ్యూజిక్‌ వింటే నాకు ఎంతో ఉత్సాహం వచ్చేది. ఈ సినిమా కోసం బలంగా, ఆత్మ విశ్వాసంతో ఉన్నామంటే కారణం ఆయనే. కీరవాణి మ్యూజిక్‌ లేకపోతే ‘హరి హర వీరమల్లు’ లేదు. గత నెల రోజులుగా నిధి అగర్వాల్‌ ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఆ అమ్మాయి వల్లే నేనూ ప్రెస్‌మీట్‌లలో పాల్గొంటున్నా.మీరు కోరుకునే సక్సెస్‌ నేనూ కోరుకుంటున్నా. మీకు నచ్చితే బాక్సాఫీస్‌ బద్దలు కొట్టేయండి. మీరే నా బలం.ఈ గుండె మీకోసమే కొట్టుకుంటుంది. మీ కష్టాలను తీర్చడానికి కొట్టుకుంటుంది. జై భారత్‌.. జై హింద్‌” అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com