మెగా 157 కేరళలో మూడో షెడ్యూల్ పూర్తి
- July 23, 2025
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా మెగా157 షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.ఇప్పటి వరకు రెండు షెడ్యూల్లు పూర్తవగా, తాజాగా కేరళలో మూడో షెడ్యూల్‌ను కూడా ముగించారు.ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “మన శంకరవరప్రసాద్ ముచ్చటగా మూడో షెడ్యూల్‌ను కేరళలో పూర్తి చేసుకున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోలో చిరంజీవి, అనిల్ రావిపూడి చార్టర్డ్ విమానంలో హైదరాబాద్‌కు చేరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
చిరుకు జోడిగా నయనతార
ఇప్పటివరకు సినిమా టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేయలేదు. అందువల్ల మెగా157 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుతున్నారు.ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి “సైరా నరసింహారెడ్డి” వంటి చిత్రాల్లో కనిపించారు. ఈ కొత్త కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్
ఈ సినిమాకు చిరంజీవి కుమార్తె సుష్మిత చిరంజీవి మరియు సాహు గారపాటి సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.అనిల్ రావిపూడి సినిమాలపై మాస్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, చిరంజీవి నటనకు ఉన్న ఆదరణ రెండూ కలిసొచ్చే ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మిగిలిన షెడ్యూల్లు పూర్తయిన అనంతరం టైటిల్, ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ లాంటి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!