కువైట్‌లో భారత మామిడి, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన..!!
- July 25, 2025
కువైట్: భారత-కువైట్ వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. ముఖ్యంగా వ్యవసాయ-ఆహార రంగంలో మరింత బలోపేతం చేయడానికి ఒక ప్రధాన అడుగులో, కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం, వ్యవసాయ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) సహకారంతో కువైట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (KCCI)లో భారతీయ మామిడి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై కీలక సమావేశాన్ని నిర్వహించింది.
APEDA నేతృత్వంలోని భారతదేశం నుండి 10 మంది సభ్యుల ప్రతినిధి బృందం వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి, ప్రీమియం భారతీయ వ్యవసాయ-ఎగుమతులను ప్రోత్సహించడానికి కువైట్‌ను సందర్శించింది. కువైట్‌లోని భారత రాయబారి, KCCI డైరెక్టర్ జనరల్ సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కువైట్ దిగుమతిదారులు, పంపిణీదారులు, ప్రముఖ హైపర్మార్కెట్ల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారతదేశం, కువైట్ మధ్య బలమైన, పెరుగుతున్న వాణిజ్య సంబంధాలను రాయబారి వివరించారు. కువైట్ అగ్ర వాణిజ్య భాగస్వాములలో భారత్ ఒకటి అని, వ్యవసాయ-ఆహార రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. "భారతీయ మామిడి ఎగుమతులకు మొదటి ఐదు గమ్యస్థానాలలో కువైట్ ఒకటి. గత సంవత్సరం దాదాపు USD 3 మిలియన్ల విలువైన దిగుమతులు జరిగాయి." అని ఆయన పేర్కొన్నారు.
అల్ఫోన్సో, బాదామి, సిందూరి వంటి రకాలు ఇప్పటికే కువైట్‌లో ప్రాచుర్యం పొందినప్పటికీ, భారతదేశంలో అతిపెద్ద మామిడి ఉత్పత్తి రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్,పశ్చిమ బెంగాల్ నుండి కొత్త ప్రీమియం మామిడి రకాలను పరిచయం చేయడం, తద్వారా కువైట్ వినియోగదారుల అభిరుచిని విస్తరించడం ఈ చొరవ లక్ష్యం అని రాయబారి తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!