‘విశ్వంభర’ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్..
- July 25, 2025
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆ సినిమా కేరళ షెడ్యూల్ పూర్తిచేసుకుంది.దీనికంటే ముందు మొదలుపెట్టిన విశ్వంభర సినిమా మాత్రం VFX వల్ల సాగుతూ వస్తుంది.అయితే విశ్వంభర డైరెక్టర్ వశిష్ట ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షూట్ ఇంకా పూర్తవ్వలేదు.ఒక స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉంది. రెండు రోజులు ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది.VFX వల్లే సినిమా కాస్త లేట్ అవుతుంది అని తెలిపారు.
నేడు విశ్వంభర ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది.సినిమాలో స్పెషల్ సాంగ్ షూటింగ్ చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి సెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు.బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ ఈ సాంగ్ ని కంపోజ్ చేస్తున్నారు.మూడు రోజుల పాటు ఈ సాంగ్ షూటింగ్ జరగనున్నట్టు సమాచారం.ఆ తర్వాత రెండు రోజుల ప్యాచ్ వర్క్ తో సినిమా షూట్ ని ముగిస్తారని తెలుస్తుంది.
డైరెక్టర్ వశిష్ట షూటింగ్ సెట్ నుంచి ఒక ఫోటో షేర్ చేసి..విశ్వంభర చివరి షెడ్యూల్ మొదలైంది. బాస్ నుంచి అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్ రానున్నాయి అని తెలిపాడు. మరి ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!