ఫ్రాన్స్ 'చారిత్రక నిర్ణయం'..స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- July 25, 2025
రియాద్: పాలస్తీనా రాష్ట్రాన్ని అధికారికంగా గుర్తించాలనే ఫ్రాన్స్ ఉద్దేశ్యాన్ని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటించడాన్ని సౌదీ అరేబియా స్వాగతించింది. ఈ చర్యను పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కుకు అంతర్జాతీయ మద్దతును బలోపేతం చేసే "చారిత్రక నిర్ణయం"గా అభివర్ణించింది. తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దుల వెంబడి స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించడంపై ప్రపంచ ఏకాభిప్రాయాన్ని తిరిగి సాధించడానికి ఫ్రాన్స్ వైఖరి దోహదం చేస్తుందని సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
పాలస్తీనా సమస్యకు న్యాయమైన, శాశ్వత పరిష్కారం కోసం పిలుపునిచ్చే అంతర్జాతీయ చట్టం , ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు అనుగుణంగా ఈ చర్య ఉందని తెలిపింది. పాలస్తీనా ను ఇంకా గుర్తించని దేశాలు వెంటనే గుర్తించే ప్రక్రియను ప్రారంభించాలని సౌదీ అరేబియా పిలుపున్చింది. అంతర్జాతీయ సమాజం శాంతిని పెంపొందించడానికి, పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన హక్కులకు మద్దతు ఇవ్వడానికి తీవ్రమైన, ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలని కోరింది. సెప్టెంబర్‌లో జరిగే UN జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఫ్రాన్స్ పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తిస్తుందని అధ్యక్షుడు మాక్రాన్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!