వెదర్ అలెర్ట్: ఈ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం..!!
- July 26, 2025
యూఏఈ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది.కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది.పొగమంచు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.ఆగ్నేయం నుండి ఈశాన్య గాలుల కారణంగా బలమైన గాలులు వీస్తాయని, దీని కారణంగా దుమ్ము, ఇసుక తుఫాన్ లు వస్తాయని హెచ్చరించారు.గంటకు 10 కి.మీ తో మొదలై, 25 కి.మీ - 50 కి.మీ.కు చేరుకుంటుందన్నారు. అరేబియా గల్ఫ్,ఒమన్ సముద్రంలో సముద్ర పరిస్థితులు స్వల్పంగా ఉద్రిక్తంగా ఉంటాయని తెలిపారు.
ఇక అబుదాబిలో గరిష్టంగా 45°C, కనిష్టంగా 32°C ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.దుబాయ్లో గరిష్టంగా 46°C - కనిష్టంగా 33°C ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.షార్జాలో గరిష్టంగా 45°C - కనిష్టంగా 32°C ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







