తమిళనాడు లో ప్రధాని మోదీ రెండోరోజు పర్యటన
- July 27, 2025
చెన్నై: తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రెండో రోజు కూడా ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.శనివారం ఆయన తూత్తుకుడి ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్‌ను ప్రారంభించారు. అంతేగాక, రూ.2,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ప్రధానంగా రహదారులు, మౌలిక సదుపాయాలకు సంబంధించి ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
గంగైకొండ చోళపురంలోని దేవాలయ సందర్శన
ఆదివారం, పర్యటన రెండో రోజు భాగంగా ప్రధాని మోదీ అరియలూర్ జిల్లాలోని గంగైకొండ రాజరాజ చోళేశ్వర దేవాలయాన్ని సందర్శించనున్నారు. చోళ రాజు రాజేంద్ర చోళుడు గంగానదీ ప్రాంతంపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించిన ఈ దేవాలయానికి ఈ ఏడాది వెయ్యేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
స్మారక నాణేం ఆవిష్కరణ
వెయ్యేళ్ల చరిత్రకు గుర్తుగా ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక స్మారక నాణేన్ని ఆవిష్కరించనున్నారు. ఇది చోళ రాజవంశపు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.
బహిరంగ సభకు ప్రధాని హాజరు
పూజా కార్యక్రమాల అనంతరం ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇందుకోసం స్థానిక అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. సభా ప్రాంగణం అంతటా పటిష్ట భద్రతా ఏర్పాట్లు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు, మరియు సీసీ కెమెరాల నిఘా అమలు చేస్తున్నారు.
పంచకట్టు ధరించిన మోదీ–తమిళ జాతికి ప్రత్యేక అభిమానం
తమిళనాడు పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ సాంప్రదాయ పంచకట్టు ధరించి ప్రజల మనసులు గెలుచుకున్నారు. విదేశీ పర్యటన ముగిసిన వెంటనే తమిళనాడు గడ్డపై అడుగుపెట్టడం తనకు అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇది శ్రీరాముని పవిత్ర భూమిగా భావిస్తున్న ఈ ప్రాంతాన్ని గౌరవించే సంకేతంగా ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది–మోదీ హామీ
తమిళనాడు ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నదని ప్రధాని స్పష్టం చేశారు. రెండు ప్రధాన రహదారి ప్రాజెక్టులను తమిళ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా మాట్లాడుతూ, దక్షిణ భారతం కూడా సమానంగా అభివృద్ధి చెందాలన్నదే కేంద్ర లక్ష్యమని ఆయన తెలిపారు .
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!