ఇంటెలిజెన్స్ బ్యూరోలో 4987 పోస్టులు..
- July 27, 2025
న్యూ ఢిల్లీ: నిరుద్యోగాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో 4987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోస అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.దీనికి సంబందించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 26వ తేదీన మొదలై ఆగస్టు 17న ముగుస్తుంది.అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://mha.gov.inద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10వ తరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.అలాగే దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర నివాస ధృవీకరణ పత్రం, స్థానిక భాషపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 ఏళ్ళ నుంచి 27 ఏళ్ళ మధ్యలో ఉండాలి. కొన్ని కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి 69,100 వరకు జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
జనరల్/ OBC/ EWS అభ్యర్థులు రూ.650, SC/ ST/ ExSM అభ్యర్థులు రూ.550, మహిళా అభ్యర్థులు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఇలా చేసుకోండి:
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ https://mha.gov.in లోకి వెళ్ళాలి
IB సెక్యూరిటీ అసిస్టెంట్ 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
ఇమెయిల్ ID, మొబైల్ నంబర్ తో రిజిస్టర్ అవ్వాలి
తరువాత వ్యక్తిగత, విద్యా వివరాలతో అప్లికేషన్ ఫారమ్ ఫిల్ చేయాలి
ఫోటోగ్రాఫ్, సంతకం, నివాస ధృవీకరణ పత్రం స్కాన్ కాపీలను అప్లోడ్ చేయాలి
దరఖాస్తు రుసుమును ఆన్లైన్లో పే చేయాలి
తరువాత ఫిల్ చేసిన ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి
రికార్డుల కోసం ఫారంను డౌన్లోడ్/ప్రింట్ చేసుకోవాలి
తాజా వార్తలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!
- ‘ఫా9లా’ క్రేజ్.. త్వరలో ఇండియా టూర్‌కు ఫ్లిప్పరాచి..!!
- ఇజ్రాయెల్ అధికారి సోమాలిలాండ్ పర్యటన.. ఖండించిన సౌదీ..!!
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్







