Dh1.33 మిలియన్ల సాలరీ రీ పేమెంట్ కేసు..ఎంప్లాయికి ఊరట..!!
- July 28, 2025
యూఏఈ: 18 నెలల వివాదాస్పద గైర్హాజరీలో చెల్లించిన Dh1.33 మిలియన్ల సాలరీని మహిళా ఉద్యోగి తిరిగి చెల్లించాలని గతంలో ఇచ్చిన లేబర్ కోర్టు తీర్పును అబుదాబిలోని కోర్టు ఆఫ్ కాసేషన్ పాక్షికంగా రద్దు చేసింది.
అంతకుముందు సాలరీ కింద Dh573,785, ఏకపక్షంగా తొలగించినందుకు పరిహారం Dh286,892, ఆర్జిత సెలవులు Dh191,261, నోటీసు పీరియడ్ చెల్లింపు Dh95,630, గ్రాట్యుటీ Dh324,330, మెంటల్, ఫిజికల్ డ్యామెజ్ Dh500,000, క్లెయిమ్ తేదీ నుండి(ఫిబ్రవరి 2, 2014) చెల్లించేవరకు వడ్డీ (12%)తో చెల్లించాలని కంపెనీపై ఆమె క్లెయిమ్ చేశారు.
అయితే, సదరు ఎంప్లాయి ఎటువంటి కారణం లేకుండా గైర్హాజరైన 18 నెలల కాలంలో జీతంగా తీసుకొన్న Dh1,338,833ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కంపెనీ కూడా కౌంటర్ క్లెయిమ్ దాఖలు చేసింది.
దిగువ కోర్టుల ప్రాథమిక తీర్పు
కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్.. మార్చి 10, 2025న తన తీర్పులో.. ఉద్యోగికి ఆమె అసలు క్లెయిమ్ లో Dh1,03,665 (సెలవు , నోటీసు పీరియడ్ సాలరీ) మాత్రమే మంజూరు చేసింది. కంపెనీ కౌంటర్ క్లెయిమ్‌ను సమర్థించింది. Dh 1.33 మిలియన్ల సాలరీని తిరిగి కంపెనీకి చెల్లించాలని ఎంప్లాయిని ఆదేశించింది.
దీంతో ఎంప్లాయి అప్పీల్ చేసింది. అయితే, అప్పీల్ కోర్టు ఏప్రిల్ 29, 2025న దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. దీని వలన ఉద్యోగి కోర్ట్ ఆఫ్ కాసేషన్‌కు తుది అప్పీల్ దాఖలు చేశారు.
కోర్టు ఆఫ్ కాసేషన్ తీర్పు
దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పులో లోపాలున్నట్లు కోర్ట్ ఆఫ్ కాసేషన్ గుర్తించింది. ఉద్యోగి ప్రభుత్వ స్పాన్సర్డ్ మెడికల్ లీవ్ కింద విదేశాలలో ఒక రోగితో పాటు వెళ్లారని నిరూపించే ఆరోగ్య శాఖ నుండి అధికారిక సర్టిఫికేట్ సహా కీలక ఆధారాలను గుర్తించడంలో దిగువ కోర్టులు విఫలమయ్యాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. 18 నెలల కాలానికి కంపెనీ ఓనర్ అభ్యంతరం లేకుండా జీతాలు చెల్లించారని, ఇది పరోక్షంగా ఆమె సెలవుకు వారి ఆమోదం ఉందని స్పష్టమవుతుందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఫైనల్ తీర్పు
జూన్ 18న ఫైనల్ తీర్పు ప్రకటించింది. "యజమాని వాదనకు ఆధారాలు లేవు. ఉద్యోగి విషయంలో పరిపాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించి, ఆమె విధులకు గైర్హాజరయ్యారు. వారు ఎలాంటి అభ్యంతరం లేకుండా సాలరీ చెల్లించారు." అని పేర్కొంది. దిగువ కోర్టుల తీర్పును రద్దు చేసింది. సాలరీ తిరిగి చెల్లించాలనే కంపెనీ డిమాండ్ (Dh1.33 మిలియన్లు)ను తిరస్కరించింది. ఉద్యోగి క్లెయిమ్ కింద Dh103,665 అందజేయాలన్న దిగువ కోర్టుల తీర్పును సమర్థించింది.అలాగే, న్యాయవాది రుసుము Dh1,000తో సహా కోర్టు రుసుములను ఉద్యోగికి చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!