తిరుపతి - శిర్డీ మధ్య 18 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే!
- July 28, 2025
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి- సాయినగర్ శిద్దీ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ రెండు ఆధ్యాత్మిక నగరాల మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 29వరకు సర్వీసులందిస్తాయని తెలిపింది.
షెడ్యూల్ ఇదే..
తిరుపతి - సాయినగర్ శిద్దీ రైలు (07637) తిరుపతిలో ప్రతి ఆదివారం ఉదయాన్నే 4గంటలకు బయల్దేరి మరుసటి రోజు (సోమవారం) ఉదయం 10.45 గంటలకు శిర్జీకి చేరుకోనుంది. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 28వరకు ప్రతి ఆదివారం ఈ రైలు సర్వీసులందిస్తుంది. అలాగే, శిర్జీ- తిరుపతి రైలు (07638) సోమవారం రాత్రి 7.35 గంటలకు బయల్దేరి మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు (తెల్లవారితే బుధవారం) తిరుపతి చేరుకోనుంది. ఈ రైలు సర్వీసులు ఆగస్టు 4నుంచి సెప్టెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి..
రైలు ఆగే స్టాప్ లు..
ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహిరాబాద్, బీదర్, భాల్కి, ఉద్గార్, లాతూర్ రోడ్డు, పర్లి, గంగఖేర్, పర్బని, సేలు, జాల్నా, ఔరంగాబాద్, నాగర్ సోల్, మన్మాడ్, కోపర్గావ్ స్టేషన్లలో ఆగనున్నాయి.. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఎసీతో పాటు స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి..
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!