పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- February 11, 2026
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. రాష్ట్రంలోని పలువురు కీలక మంత్రులకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. మంత్రులు కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్ర, అనగాని, సత్యకుమార్‌కు బెదిరింపు లేఖలు వచ్చాయి. కందుల దుర్గేశ్‌కు బెదిరింపు రావడంతో..మంత్రి కార్యాలయ అధికారులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తుళ్లూరు పోలీసులు ఈ బెదిరింపులు లేఖ వ్యవహారం పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ లేఖ ఎక్కడి నుంచి, ఎవరు పంపారు.. నేరుగా సచివాలయంలోని మంత్రి పేషీకి ఎలా చేరిందో ఆరా తీస్తున్నారు. అంతేకాదు సచివాలయంలోని సీసీ ఫుటేజ్, పోస్టల్ రికార్డుల్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.మంత్రిని బెదిరిస్తూ లేఖ పంపారా?..ఎవరైనా ఆకతాయిలు మంత్రిని బెదిరించడానికి ఇలా చేశారా అనే కాణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే మంత్రి పేషీకి బెదిరింపులు రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేవాలు కూడా ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తానికి మంత్రికి బెదిరింపు లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!







