'సార్‌ మేడమ్‌' మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్: హీరో విజయ్ సేతుపతి

- July 30, 2025 , by Maagulf
\'సార్‌ మేడమ్‌\' మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్: హీరో విజయ్ సేతుపతి

వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, వెరీ ట్యాలెంటెడ్ నిత్యా మేనన్‌ జంటగా నటించిన రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా ‘సార్‌ మేడమ్‌’. "A Rugged Love Story" అనేది ట్యాగ్ లైన్‌. పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఇటివలే తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. ఆగస్ట్ 1న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహిచారు.  

ప్రెస్ మీట్ లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈ సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. నేనెప్పుడూ హైదరాబాద్ వచ్చిన తెలుగు ప్రజలు ఎంతగానో ప్రేమ అభిమానాన్ని చూపిస్తారు. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమాకి తెలుగు పాటలు రాంబాబు గారు చాలా చక్కగా రాశారు. వినసొంపుగా వున్నాయి. అందరూ రిలీట్ చేసుకునే కథ ఇది. ఈ సినిమా కోసం పరాటా చేయడం నేర్చుకున్నాను. రెండు నెలల కోర్స్ కూడా చేశాను (నవ్వుతూ) డైరెక్టర్ సినిమాని చాలా అద్భుతంగా తీశారు.  నేను ఏ క్యారెక్టర్ చేసిన ప్రతి సినిమాని ఎంజాయ్ చేస్తూనే చేశాను. ఈ సినిమా కూడా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ గారు ఈ కథని చాలా అద్భుతంగా రాశారు. చాలా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాము. నిత్యతో వర్క్ చేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. మేము సినిమా గురించి, కథ గురించి. పాత్రల గురించి చాలా విషయాలు చర్చించుకుంటాము. ఈ సినిమా అంతా ఒక ఫ్యామిలీ ఎట్మాస్ఫియర్ లో జరిగింది. అందరూ థియేటర్స్ లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు'అన్నారు.

హీరోయిన్ నిత్యామీనన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగులో సినిమా చేసి చాలా రోజులు అయింది. అందుకే ఈ సినిమాకి తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాలని అనుకున్నాను. ఈ సినిమా విషయంలో చాలా ఆనందంగా ఉంది. విజయ్ గారితో నేను ఆల్రెడీ ఒక సినిమా కలిసి చేశాను.  అదొక డిఫరెంట్ సినిమా.  అందులో సైలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది (నవ్వుతూ). పాండిరాజ్ గారు అద్భుతమైన డైరెక్టర్. ఈ కథ వినగానే ఓకే చేశాను.  ఇది ఒక హీరో హీరోయిన్స్ సినిమా కాదు ఒక ఫ్యామిలీ లాగా ఉండే సినిమా. ఆఫ్ స్క్రీన్ కూడా మేము అందరం ఒక ఫ్యామిలీ లాగే ఉన్నాం. ఈ సినిమా కెమెరా వర్క్, మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంటాయి.  నేను నందిని ఇద్దరం కలిసి సినిమా చూసాము. చాలా ఎంజాయ్ చేసాము. తమిళ్లో సినిమా చాలా పెద్ద హిట్ అయింది. నెంబర్స్ తో పాటు అందరి మనసులో కూడా చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా అంత పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. తమిళ్ లాగే తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను'అన్నారు.  


డైరెక్టర్ పాండిరాజ్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. కార్తిగారు నటించిన చిన్న బాబు సినిమా తెలుగులో చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాకి నేనే దర్శకత్వం వహించాను. సార్ మేడం  భార్యాభర్తల మధ్య జరిగిన ఒక బ్యూటిఫుల్ స్టోరీ. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. విజయ్ సేతుపతి, నిత్య చాలా అద్భుతంగా నటించారు. లవ్ కామెడీ యాక్షన్ మాస్ ఎమోషన్స్ అన్ని ఉన్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు'అన్నారు

డైరెక్టర్ బి నందిని రెడ్డి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నేను గెస్ట్ గా రాలేదు. ఆల్రెడీ ఈ సినిమా చూసిన ఆడియన్  వచ్చాను. విజయ్ నిత్య ఇద్దరినీ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు రెండు పాత్రలు గానే కనిపించాయి. సినిమాని తప్పకుండా మీరందరి ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా చూసిన థియేటర్స్ లో ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నారు అంతలాగా కరెక్ట్ అవుతున్నారు. ఒక మంచి హోమ్ ఫుడ్ లాంటి సినిమా ఇది. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. ఈ మధ్యకాలంలో నేను చూసిన వెరీ క్యూట్ అండ్ హార్ట్ టచింగ్ మూవీ ఇది. చాలా రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది. సినిమా తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది'అన్నారు.

డిఓపి సుకుమార్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. నేను తెలుగులో యశోద సినిమా చేశాను. ఆ సినిమాతో నాకు చాలా గౌరవం వచ్చింది.  ఈ సినిమాతో ఆ గౌరవం మరింత పెరుగుతుందని నమ్ముతున్నాను. సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.

లిరిక్ రైటర్ రాంబాబు గోసాల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. పాటలు అద్భుతంగా వచ్చాయి. ఫ్యామిలీ అందరూ హాయిగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. డైరెక్టర్ గారు అద్భుతంగా తీశారు. విజయ్ సేతుపతి గారు నిత్యామీనన్ గారు అద్భుతంగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది'అన్నారు

ఎన్ వి ఆర్ సినిమాస్ సురేష్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టు. ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాం. అందరికీ థాంక్స్.

ప్రొడ్యూసర్ త్యాగరాజన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. విజయ్ సేతుపతి గారు గారితో ఈ సినిమా చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ గారు చెప్పిన కథ చాలా నచ్చింది. అప్పుడే ఒక సక్సెస్ఫుల్ సినిమా తీస్తున్నాననే నమ్మకం వచ్చింది విజయ్ సేతుపతి గారు నిత్యామీనన్ గారి లాంటి యాక్టర్స్ ప్రాజెక్టు లోకి వచ్చిన తర్వాత ఆ నమ్మకం మరింతగా పెరిగింది. దర్శకుడు మనసులో స్క్రిప్ట్ ఫీల్ అయితే అది కచ్చితంగా అద్భుతంగా వస్తుంది. ఇంత అద్భుతమైన సినిమా ఇచ్చిన విజయ్ సేతుపతి గారి,కి డైరెక్టర్ పాండిరాజు గారికి థాంక్యూ. ఇది యూనివర్సల్ సబ్జెక్టు. అందరూ రిలేట్ చేసుకుంటారు. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాని అద్భుతంగా ఆదరిస్తారని నమ్మకం ఉంది. తమిళ్లో చాలా పెద్ద విజయాలు సాధించాము. తెలుగు వర్షన్ కూడా గొప్ప అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని నమ్మకం ఉంది. మీ అందరి మీ అందరి ఆదరణ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'అన్నారు.

నటీనటులు : విజయ్ సేతుపతి, నిత్యా మీనన్, యోగి బాబు, RK సురేష్, చెంబన్ వినోద్ జోస్, శర్వణన్, దీప, జానకి సురేష్, రోషిణి హరిప్రియన్, మైనా నందిని
దర్శకత్వం: పాండిరాజ్
బ్యానర్: సత్యజ్యోతి ఫిలిమ్స్‌
నిర్మాతలు: సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్
సంగీతం: సంతోష్ నారాయణన్
డిఓపి : ఎం సుకుమార్
ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ్
ఆర్ట్ డైరెక్టర్: వీర సమర్
కొరియోగ్రఫీ: బాబా బాస్కర్
స్టంట్: కలై కింగ్సన్
పీఆర్వో: వంశీ శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com