యూఏఈలో ‘క్విక్ వీసా’ స్కామ్: ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయంటే..!!

- July 31, 2025 , by Maagulf
యూఏఈలో ‘క్విక్ వీసా’ స్కామ్: ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయంటే..!!

యూఏఈ: దుబాయ్ నివాసి ముహమ్మద్ కె. తన కొడుకుకు అత్యవసరంగా విజిట్ వీసా అవసరమైనప్పుడు, అతను ప్రీమియం ధరతో క్విక్ విజిట్ వీసాల గురించి సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చే కంపెనీని సంప్రదించాడు. అయితే, అతను బ్యాంకు ఖాతాలోకి డబ్బు బదిలీ చేసిన నిమిషంలో, ఆ కంపెనీ స్పందించడం మానేసింది. కొన్ని రోజుల్లోనే సోషల్ మీడియాలో అకౌంట్ ను తొలగించారు. సదరు కంపెనీ ఒక నెల సింగిల్ ఎంట్రీ విజిట్ వీసా కోసం సాధారణ ఛార్జీలతో పాటు Dh200 ప్రీమియంను అడిగిందని, తాను పూర్తి మొత్తాన్ని చెల్లించినట్లు తెలిపారు. మరుసటి రోజు విజిట్ వీసా లభిస్తుందని వారు తనకు హామీ ఇచ్చారని, కానీ అది ఒక స్కామ్ అని తాను త్వరలోనే తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.  

ఈ నేపథ్యంలో ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ICP) యూఏ నివాసితులు, సందర్శకులను ఫాస్ట్-ట్రాక్ అప్లికేషన్ ప్రాసెసింగ్‌ను అందిస్తున్నట్లు చెప్పుకునే అనధికార కార్యాలయాలు, సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించకుండా హెచ్చరించింది. అనుమానాస్పద ఖాతాలు, వెబ్‌సైట్‌లను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ మోసపూరిత ఆపరేటర్లపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. 

స్మార్ట్ ట్రావెల్స్ జనరల్ మేనేజర్ సఫీర్ మొహమ్మద్ ప్రకారం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా ఒక రోజులో విజిట్ వీసాలు లేదా తగ్గింపు ఛార్జీల కోసం తప్పుడు ప్రకటనలను వ్యాప్తి చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది తాము మోసపోయామని తమ వద్దకు వచ్చారని, తాము ఈ ప్రక్రియలో వారికి సహాయం చేసామన్నారు.

ఏ కంపెనీ లేదా సంస్థ ఫాస్ట్-ట్రాక్ వీసా సేవలను ప్రకటించలేవని అల్ మాస్ బిజినెస్‌మెన్ సర్వీస్ జనరల్ మేనేజర్ అబ్దుల్ గఫూర్ తెలిపారు. “వీసా ఇవ్వాలా వద్దా, దానికి ఎంత సమయం పడుతుందనేది పూర్తిగా ICP లేదా జనరల్ డైరెక్టరేట్ (GDRFA)  ఇష్టానుసారం ఉంటుంది. ఏ కంపెనీ కూడా వీసాకు హామీ ఇవ్వదు లేదా ఎంత సమయం పడుతుందో హామీ ఇవ్వదు. కుటుంబంలోని కొంతమంది సభ్యులకు వీసా మంజూరు చేయబడి, మరికొందరికి తిరస్కరించబడిన సందర్భాలు మాకు ఉన్నాయి. ఏదైనా కంపెనీ ఏదైనా రకమైన వీసాలకు హామీ ఇస్తే, అది మోసం అని అర్థం.” అని ఆయన అన్నారు. ఇలాంటి ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించింది. మరింత సమాచారం కోసం ICP లేదా GDRFA వెబ్ సైట్లను, టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com