వార్ 2 నుంచి ‘ఊపిరి ఊయలగా’ రొమాంటిక్ సాంగ్ రిలీజ్

- July 31, 2025 , by Maagulf
వార్ 2 నుంచి ‘ఊపిరి ఊయలగా’ రొమాంటిక్ సాంగ్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌, టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌లు క‌లిసి న‌టిస్తున్న భారీ చిత్రం వార్ 2.ఈ చిత్రంపై దేశ‌వ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ య‌శ్‌రాజ్ ఫిల్మ్స్‌ బ్యాన‌ర్‌పై, ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడు అయాన్‌ ముఖర్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం స్పై యాక్ష‌న్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతోంది.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.వ‌చ్చే నెల ఆగ‌ష్టు 14న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుండ‌టంతో, మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాలను ముమ్మ‌రం చేశారు.

వార్ 2 విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో, చిత్ర బృందం అప్‌డేట్‌ల‌తో అభిమానుల‌ను అల‌రిస్తోంది.ఇప్పటికే సినిమా నుంచి విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది.హృతిక్ రోష‌న్, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల మ‌ధ్య నువ్వా నేనా అన్న‌ట్లు సాగే యాక్ష‌న్ స‌న్నివేశాలు, ఉత్కంఠ‌భ‌రిత‌మైన ఛేజింగ్‌లు, భారీ సెట్టింగ్‌లు ఈ ట్రైల‌ర్‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఇద్ద‌రు స్టార్ హీరోల ఫైట్లు, వారి మ‌ధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయ‌ని ట్రైల‌ర్ స్ప‌ష్టం చేసింది. ప్ర‌తీ షాట్ గ్రాండ్‌గా క‌నిపించ‌డం, విజువ‌ల్స్ అద్భుతంగా ఉండ‌టంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యం సాధిస్తుంద‌ని సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ట్రైల‌ర్‌తో పాటు, తాజాగా మేక‌ర్స్ ‘ఊపిరి ఊయలగా’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ని విడుద‌ల చేశారు. ఈ పాట‌లో హృతిక్‌ రోష‌న్, కియారా అద్వానీల మ‌ధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. వారిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ స‌న్నివేశాలు,నృత్యాలు ఈ పాటకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.తెలుగులో ఈ పాట‌కు ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత చంద్ర‌బోస్ అద్భుత‌మైన సాహిత్యాన్ని అందించ‌గా, శశ్వాంత్‌ సింగ్ మరియు నిఖితా త‌మ గాత్రంతో ప్రాణం పోశారు.ఈ పాట ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారింది.ఈ పాట సినిమాకు మ‌రింత బ‌లాన్ని చేకూర్చి, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని మేక‌ర్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com