యూకే ప్రధాన మంత్రిని కలిసిన సుల్తాన్..!!
- July 31, 2025
లండన్: సుల్తాన్ హైతం బిన్ తారిక్..యునైటెడ్ కింగ్‌డమ్ (UK) ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్‌తో సమావేశం అయ్యారు. లండన్‌లోని ప్రధాన మంత్రి కార్యాలయంలో వీరు భేటీ అయ్యారని అధికారులు తెలిపారు.
రెండు దేశాల మధ్య ఉన్న సహకారం, వివిధ అంశాలను సమీక్షించారని,వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాల మధ్య బలమైన బంభాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారని పేర్కొన్నారు.వివిధ ఆర్థిక, పెట్టుబడి, వాణిజ్య రంగాలలో తమ పరిధులను విస్తరించడానికి పరస్పర నిబద్ధతను వ్యక్తం చేసారని తెలిపారు.
ఈ సమావేశంలో అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయని అన్నారు. అలాగే, సుల్తాన్ పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించాలనే యునైటెడ్ కింగ్‌డమ్ ఉద్దేశాన్ని స్వాగతించారు. అంతర్జాతీయ చట్టబద్ధత, రెండు-రాష్ట్రాల పరిష్కారానికి అనుగుణంగా న్యాయమైన, సమగ్ర శాంతికి దారితీసే అన్ని ప్రయత్నాలకు ఒమన్ సుల్తానేట్ మద్దతును పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







