ఆగస్టు నుండి మసీదుల వద్ద పెయిడ్ పార్కింగ్..!!
- July 31, 2025
యూఏఈ: దుబాయ్‌లోని 59 మసీదులలో దాదాపు 2,100 పార్కింగ్ స్థలాలను ఇప్పుడు పార్కిన్ కంపెనీ నిర్వహించనుంది.ప్రార్థన సమయంలో ఒక గంట పాటు భక్తులకు పార్కింగ్ ఉచితంగా అందిస్తామని, మిగిలా సమయాల్లో మసీదుల చుట్టూ 24 గంటల చెల్లింపు పార్కింగ్ సేవలను ఆగస్టులో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
ఈ పార్కింగ్ స్థలాలను జోన్ M (ప్రామాణికం) లేదా జోన్ MP (ప్రీమియం)గా వర్గికరించారు. ప్రార్థన సమయాలు కాకుండా మిగిలా సమయాల్లో వారంలో ఏడు రోజులు పెయిడ్ పార్కింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మొత్తం 59 ప్రదేశాలలో, 41 జోన్ Mలో 18 జోన్ MPలో ఉన్నాయి.
M అనేది ఒక ప్రామాణిక పార్కింగ్ జోన్, అరగంటకు Dh2, గంటకు Dh4 ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రీమియం పార్కింగ్ టారిఫ్ (MP) అరగంటకు Dh2, ఆఫ్-పీక్ సమయాల్లో గంటకు Dh4 వసూలు చేస్తారు. MP అరగంటకు Dh3, రద్దీ సమయాల్లో గంటకు Dh6 చొప్పున చెల్లించాలి.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







