కువైట్ లో హీట్ వేవ్స్, డస్టీ విండ్స్..!!
- August 01, 2025
కువైట్: ఈ వారాంతంలో కువైట్ వాతావరణం చాలా వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నుండి శనివారం వరకు, పగటి ఉష్ణోగ్రతలు 47°C - 50°C మధ్య ఉండవచ్చని, రాత్రి ఉష్ణోగ్రతలు 32°C - 35°C మధ్య ఉంటాయని అంచనా వేసింది. గాలుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని, దీని కారణంగా బహిరంగ ప్రదేశాలలో దుమ్ము ఏర్పడుతుందని హెచ్చరించారు.
పగటిపూట సముద్ర అలలు 1 నుండి 6 అడుగుల ఎత్తు వరకు ఉంటాయని.. శనివారం రాత్రి, తేమ పెరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా తీరప్రాంతాల్లో ఇది సాధారణం కంటే వెచ్చగా అనిపిస్తుందని తెలిపింది.
ప్రజలు నీరు ఎక్కువగా తాగాలని, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా ఉండాలని, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండే పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు జాగ్రత్తలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







