ఆగస్ట్ 5 నుండి తిరుమల లో పవిత్రోత్సవాలు–4న అంకురార్పణ
- August 01, 2025
తిరుమల: తిరుమల : వైఖానస ఆగమోక్తంగా నిత్యకైంకర్యాలు, సేవలు జరిగే తిరుమల శ్రీవేంకటేశ్వం | స్వామి ఆలయంలో ఆగస్ట్ 5వతేదీ నుండి 7వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.ప్రతి ఏదాడి శ్రావణమాసంలో ఈ పవిత్రోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో టిటిడి(TTD) ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా చేపడతారు.ఆలయంలో పలురకాలుగా భక్తులవల్ల గానీ, ఆలయ అధికారులు, అర్చకుల వల్ల తెలిసీతెలియక చేసిన తప్పిదాలు, పొరబాట్టు వల్ల దోష నివృత్తికి ఈ పవిత్రోత్సవాలు జరిపించడం ఆనవాయితీ.ఆగస్ట్ 5వతేదీ నుండి మూడురోజులు జరిగే ఈ ఉత్సవాలకు 4వతేదీ సోమవారం రాత్రి అంకురర్పాణ కార్యక్రమం చేపడతారు.5వ తేదీ మంగళవారం ఉదయం నుండి 7వతేదీ గురువారం పవిత్రాలు సమర్పణతో ముగుస్తాయి.ప్రతిరోజూ ఉదయం శ్రీదేవిభూదేవిసమేత.
మలయప్పస్వామి ఉత్సవర్లకు విశేష స్నపనతిరుమంజన అభిషేకాలు జరిపిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో కొన్ని ఆర్జితసేవలు రద్దయ్యాయి. పవిత్రోత్సవాలకు గృహస్థ భక్తులను అనుమతినిస్తారు.
తాజా వార్తలు
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!
- సౌదీ అరేబియాలో స్థిరంగా ద్రవ్యోల్బణం..!!
- ఖర్జూర సాగు అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- స్కూల్లో కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులు సహా ఒక టీచర్ మృతి
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!







